KTR Slams : రాహుల్ కు కేటీఆర్ సవాల్
నా ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చే దమ్ముందా
KTR : హైదరాబాద్ – మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా అని సవాల్ విసిరారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందా అన్నారు.
KTR challenge to Rahul Gandhi
తొమ్మిదిన్నర ఏండ్లలో 2 లక్షల 2వేల 735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి.. ఒక లక్షా 60 వేల 83 నియామకాలను పూర్తి చేసిందని తెలిపారు. ఈ లెక్క తప్పని నిరూపించగలవా నువ్వు అంటూ ప్రశ్నించారు.
మీరు పాలించిన సమయంలో తెలంగాణలో భర్తీ చేసిన జాబ్స్ ఎన్నో చెప్పాలన్నారు కేటీఆర్(KTR). కేవలం 10 వేల 116 మాత్రమేనని, ఇది తప్పని నిరూపించగలవా అని పేర్కొన్నారు. తమ సర్కార్ ఇన్నేళ్ల కాలంలో ఏడాదికి సగటున నింపిన ఉద్యోగాలు 16,850 అని స్పష్టం చేశారు కేటీఆర్.
మీ హయాంలో ఏడాదికి ఇచ్చిన జాబ్స్ 1,012 మాత్రమేనని పేర్కొన్నారు. జీవితంలో ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నావా..జాబ్ చేశావా..యువత ఆశలు, ఆకాంక్షలు తెలుసా , పోటీ పరీక్షలు రాశావా..ఏనాడైనా ఇంటర్వ్యూకు వెళ్లావా అని ఎద్దేవా చేశారు.
Also Read : EC Notice : కేటీఆర్ కు షాక్ ఈసీ నోటీస్