KTR TCL Global : హైదరాబాద్ లో టీసీఎల్ గ్లోబల్
వెల్లడించిన మంత్రి కేటీఆర్
KTR TCL Global : తెలంగాణకు దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , టెలికాం , తదితర ప్రధాన రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు హైదరాబాద్ పై ఫోకస్ పెడుతున్నారు. ఇందులో భాగంగా కోట్లాది రూపాయల పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. తాజాగా మరో దిగ్గజ కంపెనీ హైదరాబాద్ కు రానుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్(KTR) వెల్లడించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ప్రపంచంలోని అతి పెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలలో ఒకటిగా పేరు పొందింతి టీసీఎస్ గ్లోబల్ కంపెనీ. ఇది ఎలక్ట్రానిక్స్ పరికరాలను తయారు చేస్తుంది. కంపెనీకి సంబంధించి తయారీ యూనిట్ వాషింగ్ మెషీన్లను ఉత్పత్తి చేయడంలో ప్రత్యేకతను కలిగి ఉంది సదరు కంపెనీ. భవిష్యత్తులో రిఫ్రిజిరేటర్లను కూడా తయారు చేయనుంది టీసీఎల్ గ్లోబల్.
కాగా ఈ కంపెనీ ఏకంగా హైదరాబాద్ లో రూ. 225 కోట్లతో పెట్టుబడి పెట్టనుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల దాదాపు 500 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎల్ గ్లోబల్ కంపెనీని , యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు కేటీఆర్. రాబోయే రోజుల్లో మరికొన్ని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పుడు దేశంలోనే మన నగరం ఎక్కువ కంపెనీలను ఆకర్షించే పనిలో ఉంది.
Also Read : KTR Eatala : ఈటల భద్రతపై విచారణ