KTR Thanks KCR : సీఎం కేసీఆర్ కు థ్యాంక్స్ – కేటీఆర్
రూ. 69,000 వేల కోట్లతో మెట్రో విస్తరణ
KTR Thanks KCR : ఐటీ , పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ. 69,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వచ్చే మూడు లేదా ఐదేళ్ల కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు కనెక్టివిటీని మొత్తం 400 కిలోమీటర్ల కు విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సీఎంకు తాను ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేబినెట్ తీర్మానం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. మంగళవారం ట్విట్టర్ వేదికగా మంత్రి స్పందించారు.
KTR Thanks KCR Viral
మెట్రో విస్తరణ పనులు పూర్తయితే వేలాది మందికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందనిపేర్కొన్నారు కేటీఆర్(KTR). తుంకుంట నుండి జేబీఎస్ , కండ్లకోయి నుండి ప్యాట్నీ సెంటర్, ఇస్నా పూర్ నుండి మియాపూర్ వరకు, మియాపూర్ నుండి లక్డీకాపూల్ దాకా, ఎల్బీ నగర్ నుండి పెద్ద అంబర్ పేట, ఉప్పల్ నుండి బీబీ నగర్ దాకా, తార్నాక నుండి ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు , కందుకూరు ఎయిర్ పోర్ట్ , ఫార్మా సిటీ దాకా ఉంటుందన్నారు మెట్రో. అంతే కాకుండా శంషాబాద్ విమానాశ్రయం మీదుగా షాద్ నగర్ వరకు దీనిని విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు కేటీఆర్.
అంతే కాకుండా పలు కీలకమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర మంత్రివర్గాన్ని కూడా అభినందించారు మంత్రి కేటీఆర్. రాబోయే రోజుల్లో తెలంగాణ మరింత ఆదర్శ ప్రాయంగా మారుతుందన్నారు.
Also Read : Jawan Movie : బాద్ షా జవాన్ కు భారీ డిమాండ్