KTR : జన హితమే జెండా సంక్షేమమే ఎజెండా
మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
KTR : మా కంటూ ఓ స్పష్టమైన విజన్ ఉంది. కానీ కేంద్రంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకి ఎలాంటి లక్ష్యం లేదు. ఉన్నదల్లా ఒక్కటే మతం పేరుతో..కుల..ప్రాంతాల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప ఈ ఎనిమిదేళ్ల కాలంలో చేసింది ఏమీ లేదు. ఓ వైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తీవ్రంగా ఉంటే ప్రధాని పట్టించుకోక పోవడం దారుణమన్నారు మంత్రి కేటీఆర్.
సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం జన హితమే జెండాగా సంక్షేమమే ఎజెండాగా పని చేస్తూ పోతోందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రపంచంలోని పలు దిగ్గజ కంపెనీలన్నీ ఇవాళ బెంగళూరును కాదని హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయని ఇది తమ సర్కార్ సాధించిన ఘనత అని స్పష్టం చేశారు కేటీఆర్(KTR).
అభివృద్ది చెందాలన్నదే తమ సంకల్పమన్నారు. అన్ని వర్గాల ప్రజలందరికీ సమ న్యాయం అందుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని చెప్పారు. ఇవాళ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు అమలు చేసిన ఘనత తమదేనన్నారు. ఇవాళ ప్రపంచంలోనే హైదరాబాద్ కు అరుదైన పురస్కారం దక్కిందన్నారు కేటీఆర్.
రంగారెడ్డి జిల్లా మన్నె గూడలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పాలన చేత కాదన్నారు. కానీ ఇవాళ తమ పాలన ఆదర్శంగా ఉందన్నారు మంత్రి.
Also Read : కోమటిరెడ్డి కామెంట్స్ కలకలం