Kunal Kamra: మూడోసారీ కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన కునాల్ కమ్రా
మూడోసారీ కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన కునాల్ కమ్రా
Kunal Kamra : మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ స్టాండప్ కమెడీయన్ కునాల్ కామ్రా(Kunal Kamra) మూడోసారి కూడా పోలీసుల విచారణకు హాజరుకాలేదు. శనివారం తమ ఎదుట హాజరు కావాలంటూ ముంబయి పోలీసులు ఇచ్చిన సమన్లను ఆయన విస్మరించారు. ప్రస్తుతం ఆయన తమిళనాడులో ఉంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మద్రాస్ హైకోర్టు ఈ నెల 7వ తేదీ వరకు అరెస్ట్ చేయకూడదని ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలోనే కునాల్… పోలీసుల విచారణకు గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
Kunal Kamra Case Updates
ప్రముఖ స్టాండప్ కమెడీయన్ కునాల్ కామ్ర… ముంబైలోని హాబిటాట్ స్టూడియోలో నిర్వహించిన ”నయాభారత్” కామిడీ షోలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేను ”ద్రోహి”గా అభివర్ణించిన విషయం తెలిసిందే. దీనితో కమెడియన్ కామ్రాపై శినసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ఆ షో నిర్వహించిన స్టూడియోపై దాడి చేయడంతో పాటు… రాష్ట్రంలో పలు చోట్ల కునాల్ కామ్రాపై కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ముంబయిలోని ఖర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో… విచారణకు రావాల్సిందిగా సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేసారు. అయితే కమెడియన్ కునాల్ కామ్రా పోలీసుల విచారణకు రాలేదు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేసిన ఖర్ పోలీసులు… శనివారం విచారణకు హాజరుకావాలని ముచ్చటగా మూడో సారి నోటీసులు జారీ చేసారు.
తొలుత పోలీసులు ముంబయిలోని ఆయన నివాసానికి వెళ్లి సమన్లు అందజేయడానికి ప్రయత్నించారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో వాట్సప్ ద్వారా పంపించారు. అయితే మూడోసారి కూడా ఆయన విచారణకు గైర్హాజరయ్యారు.
Also Read : Amit Shah: మావోయిస్టులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక సూచన