Kunal Kamra: బాంబే హైకోర్టును ఆశ్రయించిన స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా
బాంబే హైకోర్టును ఆశ్రయించిన స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా
Kunal Kamra : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా… ఎట్టకేలకు బాంబే హైకోర్టును(Bombay High Court) ఆశ్రయించారు. మహారాష్ట్రలో తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని ఆయన సోమవారం బాంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. రాజ్యాంగం ప్రసాదించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, జీవించే హక్కును ఉల్లంఘించే విధంగా ఈ కేసులు ఉన్నాయని తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఏప్రిల్ 21న విచారణ జరగనుంది.
Kunal Kamra Approach
వసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ ఫిర్యాదు ఆధారంగా మార్చి 24న ఖార్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కమ్రా(Kunal Kamra) బాంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. అంతకుముందు, తాను చేసిన వ్యాఖ్యలపై అంతేకాదు చట్ట బద్ధంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
అదే సమయంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మార్చి 27న మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. షరతులతో ఏప్రిల్ 7 వరకు గడువిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. న్యాయ స్థానం బెయిల్ ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 1న నమోదైన మూడు ఎఫ్ఐఆర్‌లపై ఖార్ పోలీస్‌స్టేషన్‌కు విచారణకు హాజరు కావాలని కునాల్ కమ్రాను పోలీసులు కోరారు. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. దీనితో పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. అయినప్పటికీ స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ఇటీవల ముంబయిలోని యూనికాంటినెంటల్ హోటల్ లో గల హాబిటాట్ కామెడీ స్టూడియోలో నిర్వహించిన కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా(Kunal Kamra)… మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేను ‘గద్దార్’ (ద్రోహి)గా అభివర్ణిస్తూ ‘దిల్‌తో పాగల్ హై’ హిందీ చిత్రంలోని ఒక సినీ గీతానికి పేరడీని కామ్రా ఆలపించారు. దీనితో కామ్రా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శివసేన కార్యకర్తలు ఆ స్టూడియోపై దాడికి దిగడంతో పాటు పలు చోట్ల కేసులు పెట్టారు. స్టూడియోపైకి దాడికి దిగిన కేసులో సుమారు 40 మండి శివసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయగా… శివసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకువిచారణకు రావాలంటూ కామ్రాకు… ఖర్ పోలీసులు నోటీసులు జారీ చేసారు.
అదేసమయంలో తాను తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు… ముంబైలో తాను గత ఐదేళ్ళుగా ఉండటం లేదు కాబట్టి ఈ అక్రమ కేసుల్లో అరెస్ట్ నుండి ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వరకు కామ్రాపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మద్రాసు హైకోర్టు ఆదేశించడంతో… తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్ పోలీసులు… విచారణకు రావాలంటూ మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే మూడు సార్లు కూడా పోలీసుల విచారణకు కామ్రా గైర్హాజరయ్యారు. మరోవైపు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా సోమవారంతో ముగియడంతో… కామ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.