Kunal Kamra: మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా
మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా
Kunal Kamra : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde) పై ఓ వినోద కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే కమెడియన్ కుణాల్ కామ్రా వ్యాఖ్యలపై… శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ఆయన షో నిర్వహించిన ముంబైలోని యూనికాంటినెంటల్ హోటల్ లోని హాబిటాట్ కామెడీ స్టూడియోపై దాడి చేసి అక్కడ ఫర్నీచర్ ను ధ్వంసం చేసారు. ఈ కేసులో సుమారు 40 శివసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు. అలాగే… ఈ స్టూడియో అక్రమ నిర్మాణమంటూ బృహన్ ముంబయి పురపాలక సంస్థ కూల్చేసింది.
Kunal Kamra Visit
దీనితో స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా(Kunal Kamra) పలు స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో… అరెస్ట్ నుండి రక్షణ పొందడానికి… ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులు మహారాష్ట్రలో నమోదైనప్పటికీ అతడు తమిళనాడుకు చెందినవాడు కావడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా… మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే మద్రాస్ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ మద్రాస్ హైకోర్టు ఆయనకు అరెస్ట్ నుండి రక్షణ కల్పించినా… మహారాష్ట్ర పోలీసులు, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది వేచిచాడాల్సిందే.
ఇటీవల మహారాష్ట్ర రాజధాని ముంబైలోని యూనికాంటినెంటల్ హోటల్ లోని హాబిటాట్ కామెడీ స్టూడియోలో కుణాల్ కామ్రా హాస్య వినోద కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శిందేను ‘‘గద్దార్’’ (ద్రోహి)గా పేర్కొంటూ ఓ పేరడీ పాటను ఆలపించడం ఈ వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణాన్ని చూపుతూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై ఇటీవల స్పందించిన ఏక్‌నాథ్ శిందే… కామ్రా వ్యాఖ్యలు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ‘సుపారీ’ తీసుకున్నట్లు ఉన్నాయన్నారు. భావప్రకటన స్వేచ్ఛకు, వ్యంగ్యానికి ఓ హద్దు ఉంటుందని పేర్కొన్నారు.
Also Read : Supreme Court: కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ కేసులో గుజరాత్ పోలీసులపై సుప్రీం కోర్టు ఆగ్రహం