KV Ramanareddy: నేనే సీఎం – అంటూ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు !

నేనే సీఎం - అంటూ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు !

KV Ramanareddy: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుండి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఓడించి… తెలంగాణా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. 2028లో తెలంగాణాలో బీజేపీ గెలుస్తుందని… అప్పుడు తాను సీఎం అయ్యి… తన గర్ల్ ఫ్రెండ్ ను కేబినెట్ మంత్రిని చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో కామారెడ్డిలో నెలకొన్ని ప్రోటోకాల్ వివాదంపై రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి… ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

KV Ramanareddy Comment Viral

ఈ సందర్భంగా రమణా రెడ్డి(KV Ramanareddy) మాట్లాడుతూ… ‘2028 లో తెలంగాణాలో గెలిచేది బీజేపీనే. రేపొద్దున తెలంగాణకు నేను ముఖ్యమంత్రిని అవుతా. నా గర్ల్‌ ఫ్రెండ్‌కు కూడా కేబినెట్ హోదా ఇస్తా… అట్ల ఇయ్యొచ్చా..?. అలా ఇయ్యొచ్చు అంటే నేను కూడా తయారు చేసుకుంటాను. నేను కూడా 2028కి ప్లాన్‌లో ఉన్నా… సీఎం అవుతాను కూడా. విడిచిపెట్టేది అయితే లేదు. అవును.. మీడియాకే చెబుతున్నాను డైరెక్టుగా. ఇది నా ఛాలెంజ్. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎలా అన్నానో… 2028 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం కూడా చూపెట్టను. పత్రికా ముఖంగా చెబుతున్నాను… 2028లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది’ అని బీజేపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు కామారెడ్డిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇంతకీ సార్ చెబుతున్న ఆ గర్ల్‌ఫ్రెండ్ ఎవరబ్బా అని సోషల్ మీడియా ఈ వీడియోపై నెటిజన్లు నవ్వుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రమణా రెడ్డి వ్యాఖ్యలకు కారణం ప్రోటోకాల్ ఉల్లంఘనే ?

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించట్లేదని కొన్నిరోజులుగా కాటిపల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డిని షబ్బీర్ అలీకి రాసిచ్చారా..? అంటూ మీడియా ముందుకు వచ్చి కాటిపల్లి కన్నెర్రజేస్తున్నారు. ఏ ప్రొటోకాల్ ప్రకారం షబ్బీర్ అలీ పేరును శిలాఫలకంపై వేయిస్తారని.. ఏ హోదాతో ప్రారంభోత్సవాలు చేయిస్తారని అధికారులను ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి మీడియా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డిని.. షబ్బీర్ అలీకి ఇచ్చిన పదవిని తప్పుబడుతూ ఎమ్మెల్యే పైవిధంగా విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి ముఖ్యంగా షబ్బీర్ అలీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read : Adhir Ranjan Slams : టీఎంసీ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించడంపై విరుచుకుపడ్డ అధీర్ రంజన్

Leave A Reply

Your Email Id will not be published!