Lakhimpur Kheri Case : ఏడాది పూర్త‌యినా అంద‌ని న్యాయం

బావురుమంటున్న బాధిత కుటుంబాలు

Lakhimpur Kheri Case : సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ర్యాలీ చేప‌ట్టిన రైతుల‌పై నిర్దాక్షిణ్యంగా వాహ‌నాల‌ను న‌డిపి ప్రాణాలు కోల్పోయేందుకు కార‌ణ‌మైన ల‌ఖింపురి ఖేరి(Lakhimpur Kheri Case) కేసు ఇవాల్టితో ఏడాది పూర్త‌వుతోంది. నేటికీ ఇంకా న్యాయం బాధితుల కుటుంబాల‌కు జ‌ర‌గ‌లేదు. త‌మ వారిని కోల్పోయిన వారంతా క‌న్నీరు మున్నీర‌వుతున్నారు.

ఏడాది త‌ర్వాత రైతులు, కుటుంబాలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయి. త‌న కుమారుడిని కోల్పోయిన రైతు చ‌ర‌ణ్ జిత్ సింగ్ జూనియ‌ర్ హొం శాఖ మంత్రి అజ‌య్ మిశ్రా తేనిని తొల‌గించేంత దాకా ఏమీ జ‌ర‌గ‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అరెస్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఆశిష్ మిశ్రా ఎక్కువ‌గా జైలులోనే ఉన్నారు.

మిశ్రా వేగంగా న‌డిపిన కారు ఘ‌ట‌న‌లో కీల‌క నిందితుడిగా ఉన్నారు. కేంద్ర మంత్రి కుమారుడు న‌డుపుతున్న‌ట్లు ఆరోపించ‌బడిన కారు, ఆ త‌ర్వాత జ‌రిగిన హింస , దీనికి సంబంధించిన కేసుపై విచార‌ణ స‌జావుగా సాగ‌లేద‌ని బాధిత కుటుంబాలు మొద‌టి నుంచి నెత్తీ నోరు మొత్తుకుంటున్నాయి.

37 ఏళ్ల ద‌ల్జిత్ సింగ్ ను పోగొట్టుకున్న చ‌ర‌ణ్ జిత్ సింగ్ బాధ వ‌ర్ణానాతీతం. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌నేది త‌మ ప్ర‌ధాన‌మైన డిమాండ్ అని కానీ ఏమి జ‌ర‌గ‌లేద‌న్నారు. నిందితుడి తండ్రి అత్యంత ప‌వ‌ర్ ఫుల్. ఆయ‌న‌ను డిస్మిస్ చేసేంత దాకా త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌న్నారు.

న‌లుగురు రైతుల‌తో పాటు ఓ జ‌ర్న‌లిస్ట్ కూడా ఈ కారు ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయారు. అల‌హాబాద్ హైకోర్టు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. కానీ సుప్రీంకోర్టు దానిని ర‌ద్దు చేసింది.

Also Read : ఏనాడూ పోటీ చేస్తాన‌ని అనుకోలేదు – ఖ‌ర్గే

Leave A Reply

Your Email Id will not be published!