Lalit Modi: లండన్‌ లోని ఓ పార్టీలో లలిత్‌ మోదీ, విజయ్‌మాల్యా ల డ్యాన్స్‌

లండన్‌ లోని ఓ పార్టీలో లలిత్‌ మోదీ, విజయ్‌మాల్యా ల డ్యాన్స్‌

Lalit Modi : విదేశాలకు పారిపోయిన ఘరానా ఆర్థిక నేరగాళ్లు లండన్‌ లోని ఓ పార్టీలో ‘ఐ డిడ్‌ ఇట్‌ మై వే’ అనే పాట పాడుతూ.. స్టెప్పులేయడం నెట్టింట వైరల్‌ అవుతోంది. కామన్వెల్త్‌ కుంభకోణం, మనీలాండరింగ్‌ కేసుల్లో నిందితుడు, ఐపీఎల్‌ మాజీ చీఫ్‌ లలిత్‌ మోదీ (Lalit Modi) లండన్‌ లోని తన ఇంట్లో ఇచ్చిన ఓ పార్టీకి రూ.9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యా హాజరయ్యారు. మాజీ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ సహా… 310 మంది అతిథులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ విందులో లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యా కలిసి ఫ్రాంక్‌ సినట్రా ఆలపించిన ప్రసిద్ధ పాట ‘ఐ డిడ్‌ ఇట్‌ మై వే..’ను కలిసి పాడారు.

Lalit Modi – Vijay Mallya Viral in London

ఈ వీడియోను లలిత్‌ మోదీ స్వయంగా తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేశారు. ‘‘ఇంటర్నెట్‌ను ఈ వీడియో బ్రేక్‌ చేయదని ఆశిస్తున్నా. ఇది వివాదాస్పదమే కానీ.. నేను చేసేది అదే’’ అని ఆయన పోస్టు చేశారు. క్రిస్‌ గేల్‌ కూడా తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఈ వీడియోలు, ఫొటోలను షేర్‌ చేశారు. విజయ్‌ మాల్యా, లలిత్‌ మోదీని భారత్‌కు రప్పించాలని సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే..! అయితే.. పరారీలో ఉన్న నేరస్థులుగా కోర్టులు గుర్తించిన వీరిద్దరు మాత్రం చిందులేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Also Read : Dalai Lama: 6న దలైలామా 90వ జన్మదిన వేడుకలు

Leave A Reply

Your Email Id will not be published!