Leafy Vegetables : ఆకు కూరలు అని ఈజీగా తీసి పారేయకండి. శరీరం బలంగా ఉండాలంటే. ఆరోగ్యవంతమైన ఆహారం కావాలంటే. పని చేసే శక్తి రావాలంటే ముందుగా ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లినా చెప్పేది ఒక్కటే ఆకు కూరలు తినండి అని. వంటలో వాడక పోయినా సరే కనీసం పచ్చివైనా తీసుకోండంటూ సూచించడం పరిపాటి.
రోజూ వారీగా మనం ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తాం. మన కళ్ల ముందే ఆకు కూరలు కనిపిస్తాయి. కానీ వాటి వైపు కన్నెత్తి చూడం. మనం ఫాస్ట్ ఫుడ్ పేరుతో అడ్డమైన చెత్తను తింటూ రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇక కూరగాయల మార్కెట్ కు వెళితే ముందుగా కూరగాయలు మాత్రమే చూస్తారు. కానీ పచ్చని ఆకు కూరల(Leafy Vegetables )వైపు చూడరు.
వంటంతా పూర్తయ్యాక గానీ కొత్తి మీర, పుదీన జోలికి మాత్రం వెళ్లరు. అటు ఆరోగ్య పరంగా ఇటు రుచి పరంగా ఈ ఆకు కూరలు పనికి వస్తాయి. వీటిని పండించేందుకు తక్కువ ఖర్చు అవుతుంది. పొలంలోనే కాదు ఇంటి పంటగా కూడా వీటిని పండించ వచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. వీటిని ఆడుతూ పాడుతూ సాగు చేయొచ్చు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా సంపాదించేందుకు వీలవుతుంది. కేవలం కొద్ది పాటి నీరు, కొద్ది పాటి స్థలం ఉంటే చాలు వేలకు వేలు సాంపదించవచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. జస్ట్ ఉన్న చోటు నుంచే ఎర్నింగ్ చేయొచ్చు. కేవలం నెల వ్యవధిలో లక్షలు సంపాదించే వాళ్లున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు.
తెలంగాణలోని ప్రతి ఊరులో ఆకుకూరలు విరివిగా దొరుకుతాయి. కొత్తి మీర సాగు చేయాలంటే మంచి ధనియాల విత్తనాలు వాడితే అధిక దిగుబడి వస్తుంది. దేశీవాళీ విత్తనాలకు ప్రాధాన్యత ఇస్తే రైతులకు మేలు. ఇక సాగుకు సంబంధించి ఎకరానికి 50 కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి.
ఇక కిలో విత్తనాల ధర 90 నుంచి వంద రూపాయల వరకు మార్కెట్ లో దొరుకుతాయి. దాదాపు ఎకరా సాగుకు 5 వేల రూపాయల దాకా ఖర్చవుతుంది. దుక్కి దున్నడం చాలా ఈజీ. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే ఇంకా బెటర్. వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తే మేలవుతుంది. ఇక విత్తనాలు చల్లడం నుంచి కోత దాకా కొత్తిమీరకు(Leafy Vegetables )పట్టే సమయం నెల రోజులే.
కొంత పాటి పెట్టుబడి పెడితే అంతకు ఎక్కువ లాభం చూడొచ్చు. ఓపిక వుంటే అమ్ము కోవచ్చు. లేదంటే చిరు వ్యాపారులకు అప్పగిస్తే వాళ్లే తీసుకుని వెళతారు. ఇక ఒకసారి కొస్తే మరోసారి సాగు చేయాల్సిందే. ఇక మార్కెట్ విషయానికి వస్తే విపరీతమైన డిమాండ్ ఉంటోంది. సో ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదించ వచ్చు.
No comment allowed please