Lecturer Quits : కర్ణాటకలో చోటు చేసుకున్న హిజాబ్ వివాదం మరింత ముదిరింది. దీనిపై హైకోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. ఇంకా తీర్పు రాలేదు. అంత వరకు ఇరు వర్గాలు సంయమనం పాటించాలని(Lecturer Quits) కోరింది రాష్ట్ర ప్రభుత్వం.
ఎవరైనా నిరసనలు చేస్తే ఊరుకోమంటూ ఇప్పటికే రాష్ట్ర హోం శాఖ మంత్రి హెచ్చరించారు. తాజాగా రాష్ట్రంలోని తుమకూరులోని జైన్ పీయూ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా పని చేస్తోంది చాందిని.
తమ విద్యా సంస్థలో హిజాబ్ ఉండ కూడదని స్పష్టం చేయడంతో తాను బాధకు గురైనట్లు తెలిపారు. తనకు ఉద్యోగం కంటే ఆత్మ గౌరవం ముఖ్యమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపింది.
ఈ మేరకు తన రాజీనామా లేఖను కాలేజీ యాజమాన్యానికి సమర్పించింది. ప్రస్తుతం చాందిని రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఇదిలా ఉండగా గత వారం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల తర్వాత దక్షిణాది రాష్ట్రంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు క్లాస్ రూమ్ లలో హిజాబ్ లు, కుంకుమ పువ్వులు లేదా మత పరమైన చిహ్నాలను ధరించ కూడదని స్పష్టం చేసింది.
కాగా గత మూడు ఏళ్లుగా జైన్ పీయూ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా పని చేశారు. ఈ మూడేళ్లలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదు. హాయిగా పని చేస్తున్నా. కానీ నిన్న ఉదయం మా ప్రిన్సిపాల్ పిలిచి హిజాబ్ ధరించ కూడదని సూచించారు.
వారికి ఆదేశాలు ఉన్నాయంటూ తెలిపారు. నా ఆత్మ గౌరవానికి భంగం కలిగించిందనే భావించి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు చాందిని.
Also Read : సమిష్టిగా సవాళ్లను ఎదుర్కోవాలి