Leopard: ఇక్రిశాట్‌లో బంధించిన చిరుతను జూకు తరలించిన అధికారులు

ఇక్రిశాట్‌లో బంధించిన చిరుతను జూకు తరలించిన అధికారులు

Leopard : సంగారెడ్డి జిల్లా పటాన్‏చెరువు మండలం ఇక్రిశాట్‌ క్యాంపస్‏ లో సంచరిస్తున్న చిరుతను జూపార్కు అధికారులు ఎట్టకేలకు బంధించారు. జూపార్కు రెస్క్యూ టీమ్‌ హెడ్‌ డాక్టర్‌ ఎం.ఎ హకీమ్‌ నేతృత్వంలో సిబ్బంది ఇక్రిశాట్‌ కు వెళ్లి చిరుతను బోనులో బంధించారు. అనంతరం దానిని జూపార్క్ కు తరలించారు. చిరుతను బంధించిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి… వారి ఆదేశాలకు అనుగుణంగా అమ్రాబాద్ ఫారెస్ట్ లో వదిలిపెట్టడానికి అటవీశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Leopard Trapped

పటాన్‏ చెరువు మండలం ఇక్రిశాట్‌ క్యాంపస్‏ లో వేలాది ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించిన పరిశోదనలు జరుగుతుంటాయి. అయితే… ఎక్కడినుంచి వచ్చిందో… ఎలా వచ్చిందో తెలియదు కాని చిరుతపులి సంచారాన్ని సిబ్బందితోపాటు స్థానికులు గుర్తించారు. దీనితో ఇక్రిశాట్‌ ఉద్యోగులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయాన్ని సంగారెడ్డి అటవీ అదికారులకు తెలియజేయడంతో ఎట్టకేలకు దానిని బోనులో బంధించారు.సుమారు ఆరేళ్ల వయస్సున్న చిరుత ఆరోగ్యంగా ఉందని క్యూరేటర్‌ జె.వసంత తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమ్రాబాద్‌ ఫారెస్ట్ లో వదలిపెడతామన్నారు.

Also Read : Tamilnadu: 1000 కిలోల ఆలయాల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం

Leave A Reply

Your Email Id will not be published!