Umair Sandhu : ‘లైగ‌ర్’ విజ‌య్ వ‌న్ మేన్ షో – ఉమైర్ సంధు

మూవీ ఫ‌స్ట్ రివ్యూలో సెన్సేషన్ కామెంట్స్

Umair Sandhu : డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే, ర‌మ్య‌కృష్ణ క‌లిసి న‌టించిన లైగ‌ర్ మూవీ ఓవ‌ర్సీస్ లో ముందుగానే విడుద‌లైంది.

దేశ మంత‌టా 25న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మోస్ట్ పాపుల‌ర్ విశ్లేష‌కుడిగా పేరొందిన ఉమైర్ సంధు(Umair Sandhu) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు లైగ‌ర్ మూవీపై. ఒక ర‌కంగా రౌడీ అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పాడు.

ప్ర‌ధానంగా సంధు ఇచ్చే రివ్యూల‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంది. లైగ‌ర్ పై త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ ను ఆకాశానికి ఎత్తేశాడు.

సినిమా మొత్తంగా విజ‌య్ ఒక్క‌డే క‌నిపిస్తాడ‌ని, అంటే అర్థం త‌న భుజాల మీద‌కు వేసుకుని న‌డిపించాడ‌ని పేర్కొన్నాడు. ఒక్కోసారి విజిల్స్ కూడా వేయాల‌ని అనిపిస్తుంద‌ని తెలిపాడు.

ఒక ర‌కంగా చెప్పాలంటే వ‌న్ మేన్ షో చేశాడంటూ కితాబు ఇచ్చాడు దేవ‌ర‌కొండ‌కు. యాక్ష‌న్ , స్టంట్స్ , డైరెక్ష‌న్ సింప్లీ సూప‌ర్బ్. ఇక ర‌మ్య‌కృష్ణ పాత్ర కూడా వెరీ వెరీ స్పెష‌ల్.

అయితే క‌థ‌, స్క్రీన్ ప్లే మాత్రం ఏమంత బాగోలేదు అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు ఉమైర్ సంధు. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీపై అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు.

పూరీ జ‌గ‌న్నాథ్, చార్మీ కౌర్ , క‌ర‌ణ్ జోహార్ , అపూర్వ మెహ‌తా సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే లైగ‌ర్ మూవీ ప్ర‌మోష‌న్ ను అద‌ర‌గొట్టింది మూవీ టీం.

ఎక్క‌డికి వెళ్లినా జ‌నాద‌ర‌ణ ల‌భించింది. మొత్తంగా ఈ చిత్రంపై ఎన‌లేని ఆశ‌లు పెట్టుకున్నాడు డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్.

Also Read : విజ‌య్ దేవ‌ర‌కొండ నిహారిక బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!