Niharika NM Vijay : విజ‌య్ దేవ‌ర‌కొండ నిహారిక బిగ్ ఫైట్

సోష‌ల్ మీడియాలో ఫోటోలు హ‌ల్ చ‌ల్

Niharika NM Vijay : డైనమిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రౌడీ బాయ్ గా పేరొందిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే క‌లిసి న‌టించిన లైగ‌ర్ మూవీపై భారీ ఎత్తున అంచ‌నాలు ఉన్నాయి.

ఆగ‌స్టు 25న అంటే గురువారం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. పెద్ద ఎత్తున సినిమా ప్ర‌మోష‌న్ లో మునిగి పోయింది చిత్ర బృందం.

తాజాగా ఇందుకు సంబంధించి ప్ర‌ముఖ యాంక‌ర్, సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయ‌న్స‌ర్ గా పేరొందిన నిహారిక ఎన్ఎం సంచ‌ల‌నంగా మారారు. ఆమె ఏకంగా రౌడీ బాయ్ తో బిగ్ ఫైట్ కు దిగారు.

ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ఫోటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. డిజిట‌ల్ కంటెంట్ క్రియేష‌న్ లో నిహారిక ఎన్ఎం(Niharika NM) దేశంలోనే టాప్ లో కొన‌సాగుతున్నారు.

ఆమె చేసే ఇంట‌ర్వూలు, షోస్, రాసే కంటెంట్ కు విప‌రీత‌మైన క్రేజ్ నెల‌కొంది. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నిహారిక ఎన్ఎం ఇద్ద‌రూ క‌లిసి ఒక‌రినొక‌రు కొట్టుకున్నారు స‌రదాగా.

ఈ బిగ్ ఫైట్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అప్ లోడ్ చేసిన కొద్ది క్ష‌ణాల్లోనే వేలాదిగా లైక్స్ తో పాటు కామెంట్స్ వ‌స్తున్నాయి.

ఇంత‌కీ ఎవ‌రీ అమ్మాయి. ఇలా ఇంత ధైర్యంగా రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో(Vijay Deverakonda) పోటీ ప‌డుతోందంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఒక పంచ్ కౌగిలించుకునేంత దాకా ఎలా మార‌బోతోందో ఇది తెలియ చేస్తుంది.

నిహారిక నేల‌పై పాకుతూ విజ‌య్ దేవ‌ర‌కొండ నుండి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో వీడియో ముగుస్తుంది. కానీ చివ‌ర‌కు రౌడీ బాయ్ నిహారిక ఎన్ఎంను ప‌ట్టుకోవ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ర్షించేలా చేస్తోంది.

Also Read : డ్యాన్స‌ర్ స్వ‌ప్నా చౌద‌రికి అరెస్ట్ వారెంట్

Leave A Reply

Your Email Id will not be published!