Lingayats Protest : కదం తొక్కిన లింగాయత్‌లు
రిజర్వేషన్ల కోసం ఆందోళన
Lingayats Protest : రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ లింగాయత్ లు భారీ ప్రదర్శన చేపట్టారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, సీఎం బస్వరాజ్ బొమ్మైలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ ఈ నిరసనకు నాయకత్వం వహిస్తున్నారు.
రాజకీయాల్లో, విద్య, ప్రభుత్వ ఉద్యోగాలతో తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 18 శాతానికి పైగా ఉన్నారు లింగాయత్ లు. కర్ణాటక లోని అగ్రవర్ణ లింగాయత్ గ్రూప్ లోని ఉప విభాగానికి చెందిన పంచమసాలి లింగాయత్ కమ్యూనిటీకి చెందిన లక్ష మందికి పైగా గురువారం సువర్ణ సౌధ నుండి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
బొమ్మై, యెడియూరప్పలకు వ్యతిరేకంగా గళం విప్పారు. లింగాయత్ జనాభాలో 60 శాతం ఉన్న పంచమసాలి లింగాయత్(Lingayats Protest) లు లింగాయత్ సామాజిక వర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నా తమకు అవసరమైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆరోపించారు.
ఇదిలా ఉండగా దాదాపు 7 జిల్లాలతో కూడిన ముంబై – కర్ణాటక ప్రాంతంగా పిలిచే కిత్తూరు కర్ణాటక ప్రాంతంలో దాదాపు 100 అసెంబ్లీ సీట్లకు పైగా ప్రభావితం చేసే శక్తి ఈ కమ్యూనిటీకి ఉండడం విశేషం. కిత్తూరు కర్ణాటక ప్రాంతంలో ఉత్తర కన్నడ, బెలగావి, గడగ్ , ధార్వాడ్ , విజయపుర, బాగల్ కోట్ , హవేరి ఉన్నాయి. వీరిలో ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడిన వారే ఉన్నారు.
వీరశైవ లింగాయత్ లకు ప్రస్తుతం ఓబీసీ కోటాలో 3బీ కేటగిరి కింద 5 శాతం రిజర్వేషన్లు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సమస్య సీఎంకు తలనొప్పిగా మారింది.
Also Read : కరోనా లేఖలు ‘కాషాయాని’కి వర్తించవా – జైరాం