Shivaji Statue: ఛత్రపతి శివాజీ విగ్రహం కాంట్రాక్టర్ పై లుక్‌అవుట్ నోటీసులు !
ఛత్రపతి శివాజీ విగ్రహం కాంట్రాక్టర్ పై లుక్‌అవుట్ నోటీసులు !
Shivaji Statue: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం(Shivaji Statue) కూలిపోయిన ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపింది. ఇప్పటికే విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని ప్రతిపక్షాలు పడిపడుతున్నాయి.
Shivaji Statue…
తాజాగా ఈ ఘటనకు సంబంధించి శివాజీ విగ్రహ కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టేపై సింధుదుర్గ్ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఆపడానికి అన్ని విమానాశ్రయాలకు లుక్‌అవుట్ నోటీసులు పంపినట్లు పోలిసులు తెలిపారు. ఠాణెకు చెందిన జైదీప్ ఆప్టే ఆధ్వర్యంలోనే ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు. మరోవైపు.. శివాజీ విగ్రహం కూలిన ఘటనలో కేవలం శిల్పిని మాత్రమే కాకుండా ఇతరులను కూడా బాధ్యుల్ని చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్‌లో 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని(Shivaji Statue) గతేడాది డిసెంబరులో ఏర్పాటు చేశారు. నేవీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఇటీవల ఆ విగ్రహం కూలిపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనితో విగ్రహ నిర్మాణంలోనే పెద్ద కుంభకోణం జరిగిందని విపక్షాలు ఆరోపించాయి. విగ్రహ నిర్మాణాన్ని నౌకాదళం పర్యవేక్షించింది తప్ప… తాము కాదని ప్రభుత్వం పేర్కొంది. విగ్రహం కూలిపోవడానికి గల కారణాలను గుర్తించేందుకు, పునర్నిర్మాణానికి రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై మహారాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న వేళ… ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే స్పందించారు. వందసార్లు ఆయన పాదాలు తాకేందుకు సిద్ధమని, అవసరమైతే క్షమాపణలు చెబుతానన్నారు. రాజకీయాలే చేయాలనుకుంటే విపక్షాలకు అనేక అంశాలు ఉన్నాయని, శివాజీ మహారాజ్‌ను దీనికి దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : CM Chandrababu : వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి సాయం కోరిన చంద్రబాబు