Snake: సీటు కింద పాము చూసి అవాక్కైన లారీ డ్రైవర్

సీటు కింద పాము చూసి అవాక్కైన లారీ డ్రైవర్

Snake : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ లారీ డ్రైవర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అతడి సీటు కింద ఏడు అడుగుల విషపూరిత పాము ఉండటం కలకలం రేపింది. తొలుత దాన్ని టైరు శబ్దంగా భావించినప్పటికీ… ఓ చోట ఆగినప్పుడు పరిశీలించగా పాము (Snake) అని తెలియడంతో షాక్‌కు గురయ్యాడు. దాదాపు 300 కి.మీ దూరం ప్రయాణం తర్వాత దాన్ని గమనించడం గమనార్హం. హరియాణాలోని అంబాలాలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Snake Viral in Lorry Driver Seat

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ నుంచి హరియాణాలోని అంబాలాకు ఓ లారీ బయలుదేరింది. క్యాబిన్‌లో హిస్స్‌.. శబ్దాలు వినిపిస్తున్నట్లు గ్రహించిన డ్రైవర్‌, తొలుత అవి టైరు లీకేజీ నుంచి కావచ్చని భావించాడు. రాత్రి 9గంటల సమయంలో ఓ చోట వాహనాన్ని నిలిపిపాడు. టీ తాగి వచ్చే క్రమంలో సీటు మధ్యలో ఉన్న పామును చూసి అవాక్కయ్యాడు.

అప్రమత్తమైన డ్రైవర్‌… వెంటనే లారీ ఓనర్‌కు ఈ విషయాన్ని తెలియజేశాడు. స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. దాదాపు గంటన్నర ప్రయత్నించి సీటు కింద నక్కిన పామును ఎట్టకేలకు పట్టుకున్నారు. దీంతో ఊపిరి పీల్చుకున్న లారీ డ్రైవర్‌.. అటవీశాఖ అధికారులు తన ప్రాణాలు రక్షించారని ధన్యవాదాలు తెలిపాడు. వర్షం తర్వాత ఆశ్రయం కోసం ఇలా పాములు వాహనాల్లోకి వస్తుంటాయని అధికారులు వెల్లడించారు.

Also Read : Election Commission: దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుకు ఈసీ సిద్ధం !

Leave A Reply

Your Email Id will not be published!