Lovers Romance: బైక్‌ పై వికృత చేష్టలు చేసిన యువజంట ! 53,500 రూపాయలు జరిమానా !

బైక్‌ పై వికృత చేష్టలు చేసిన యువజంట ! 53,500 రూపాయలు జరిమానా !

Lovers Romance : ఇటీవలి కాలంలో కొందరు యువతీ యువకులు రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. బైక్ పై రొమాన్స్ చేస్తూ హైవేలు, ప్రధాన రహదారులపై హడావుడి చేస్తున్నారు. ఇటీవల విజయవాడ ప్రకాశం బ్యారేజీపై ఓ యువ జంట బైక్ పై రొమాన్స్ చేయడంతో… ఆ వీడియాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) గ్రేటర్‌ నోయిడాలో చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ నేపధ్యంలో ఈ జంటపై చర్యలు తీసుకోవాలని పోలీసులను పలువురు కోరారు.

Lovers Romance on Bike..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా వైరల్‌ అయిన ఈ ఐదు సెకన్ల క్లిప్‌లో ఒక యువకుడు బైక్ నడుపుతుండగా, ఒక యువతి పెట్రోల్ ట్యాంక్‌పై అతనికి రివర్స్ పొజిషన్‌లో కూర్చుని, తన కాళ్లను అతనికి వెనుకవైపుగా ఉంచింది. నిత్యం రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వేపై వారిద్దరూ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. అయితే, ఆ మహిళ చేతిలో హెల్మెట్ ఉంది. అక్కడి సీసీటీవీ కెమెరాలలో ఈ ఉదంతమంతా రికార్డయ్యింది.

ఈ వీడియోను గమనించిన తాము, ఆ వాహనం నంబరు ఆధారంగా బైక్‌ను గుర్తించి మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత విభాగాల కింద రూ.53,500 చలానా జారీ చేశామని నోయిడా (ట్రాఫిక్) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లకన్ సింగ్ యాదవ్ మీడియాకు పారు. ఈ సంఘటన సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం తదితర నేరాల కింద మోటార్ వాహనాల చట్టంలోని వివిధ విభాగాల కింద పోలీసులు ఆ వాహనానికి చలానా జారీ చేసినట్లు తెలిపారు. బైక్ పై యువ జంట చేసిన వికృత చేష్టలకు పోలీసులు భారీ చలానా వడ్డించినప్పటికీ… ఆ యువ జంట ఇంతవరకు స్పందించలేదు.

Also Read : Vijay Rupani: భర్తకు తుది వీడ్కోలు పలికి కన్నీరుమున్నీరైన అంజలీ రూపానీ

Leave A Reply

Your Email Id will not be published!