Lulu Manjeera Mall: లులూ చేతికి కూకట్పల్లి మంజీరా మాల్
లులూ చేతికి కూకట్పల్లి మంజీరా మాల్
Lulu Manjeera Mall : హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని మంజీరా మాల్ అంటే తెలియని వారు ఉండరు. అయితే ఇప్పుడు అది లులూ(Lulu Manjeera Mall) వశమైంది. ఇంతకాలం మంజీరామాల్ ను అద్దెకు తీసుకుని నడుపుతున్న లులూ యాజమాన్యం… ఇప్పుడు మంజీరా మాల్ ను వేలంపాటలో రూ.319.42 కోట్లకు స్వాధీనం చేసుకుంది. మంజీరామాల్ యాజమాన్య సంస్థ అయిన మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్ ను… నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఏప్రిల్ 10, 2025న నిర్వహించిన దివాలా వేలంపాటలో లులూ ఇంటర్నేషనల్ షాపింగ్స్ మాల్స్ సొంతం చేసుకుంది.
Lulu Manjeera Mall in Hyderabad
ఈ మాల్ కోసం మొత్తం 49 సంస్థలు పోటీ పడగా… ₹317.30 కోట్ల బకాయిలు ఉన్న మంజీరా మాల్ ను ₹318.42 కోట్లతో పరిష్కార ప్రణాళికను అందించిన లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు క్రెడిటర్ల కమిటీతోపాటు, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆమోదం తెలిపింది. కేటలిస్ట్ ట్రస్టీషిప్ లిమిటెడ్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఉన్నాయి.
మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్ తమ వద్ద తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో కేటలిస్ట్ ట్రస్టీషిప్ గత ఏడాది జులైలో ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దీన్ని ఎన్సీఎల్టీ అనుమతించడంతో పాటు దివాలా ప్రక్రియ నిర్వహించడానికి బీరేంద్ర కుమార్ అగర్వాల్ ను రిజల్యూషన్ ప్రొఫెషనల్ గా నియమించింది. దీనితో బిడ్లు పిలవడం, ఆసక్తి గల సంస్థలతో సంప్రదింపులు సాగించడం, సీఓసీ సమావేశాలు నిర్వహించడం వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేశారు. ఈ దశలన్నీ అధిగమించి లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్, మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకుంది.
Also Read : Mahesh Kumar Goud: మాజీ మంత్రి కేటీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు