M Venkaiah Naidu: తిరుమలలో అన్నప్రసాదం స్వీకరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
తిరుమలలో అన్నప్రసాదం స్వీకరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
M Venkaiah Naidu : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అందిస్తున్న అన్నప్రసాదం ఎంతో శుచిగా, రుచిగా ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) అన్నారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఆదివారం తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి వెంకయ్యనాయుడు అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులతో ముచ్చటించారు. అన్నప్రసాదాలు బాగున్నాయని భక్తులు ఆయన వద్ద ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… శ్రీవారి సేవకులుగా భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలందిస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇతర అధికారులు పాల్గొన్నారు.
M Venkaiah Naidu – తిరుమల శ్రీవారి సేవలో గవర్నర్ అబ్దుల్ నజీర్
తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా… తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
Also Read : KTR: బీఆర్ఎస్ ను ఇతర పార్టీల్లో విలీనం చేసే ప్రసక్తే లేదు – కేటీఆర్
