Maddali Giridhar: గుంటూరులో వైసీపీకి బిగ్ షాక్ ! మాజీ ఎమ్మెల్యే గిరిధర్‌ రాజీనామా !

గుంటూరులో వైసీపీకి బిగ్ షాక్ ! మాజీ ఎమ్మెల్యే గిరిధర్‌ రాజీనామా !

Maddali Giridhar: ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు తిరగకముందే… వైసీపీకు షాక్ తగిలింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చూడటంతో… నాయకులు ప్రక్కపార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో వైసీపీకు షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌కు రాజీనామా లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి, నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ కు పంపించారు.

Maddali Giridhar Resigned

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గుంటూరు పశ్చిమ నుంచి గెలుపొందిన గిరిధర్‌(Maddali Giridhar)… ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ వస్తుందని ఆశించి… భంగపడ్డారు. ఆ స్థానం నుంచి విడదల రజినీకి టికెట్‌ ఇవ్వడంతో ఎన్నికల సమయంలో సైలెంట్‌ గా ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి క్లీన్‌ స్వీప్‌ చేయడంతో గిరిధర్‌ ఎక్కడా బయటకు రాలేదు. ఇప్పుడు ఏకంగా పార్టీని వీడారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మద్దాలి… మళ్లీ టీడీపీలో చేరబోతున్నట్లు టాక్.
వీలుకాని పక్షంలో జనసేనలో చేరడానికి అవకాశం కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ నగర అధ్యక్ష పదవి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు.

Also Read : CM Revanth Reddy : తెలంగాణలోని కీలక అంశాలపై చర్చకు కేంద్ర మంత్రితో భేటీ అయిన సీఎం

Leave A Reply

Your Email Id will not be published!