Madhu Yashki : ప్రచార కమిటీ చైర్మన్ గా మధు యాష్కి
వైస్ చైర్మన్ గా మాజీ ఎంపీ పొంగులేటి
Madhu Yashki : కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మాజీ ఎంపీ మధు యాష్కి(Madhu Yashki) గౌడ్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. గౌడ్ తో పాటు మరో కీలకమైన నేత ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా నియమించింది. ఈ ఇద్దరు కూడా మాజీ ఎంపీలు కావడం విశేషం.
కాగా ప్రచార కమిటీ కన్వీనర్ గా అజ్మతుల్లా సయ్యద్ హుస్సేనీతో పాటు 21 మందికి కార్యవర్గ కమిటీలోకి తీసుకుంది. వారిలో జెడ్పీసీలు, ఇతర పదవులలో కీలకంగా ఉన్న వారికి కేటాయించింది పార్టీ. కమిటీలో
జెట్టి కుసుమ కుమార్ , ప్రవీణ్ రెడ్డి, కత్తి కార్తీక గౌడ్ , జావీద్ అక్రమ్ , నరేందర్ ముదిరాజ్ , జూలూరు ధనలక్ష్మి గౌడ్ లను నియమించింది.
వీరితో పాటు కమిటీ సభ్యులుగా దయాకర్ గౌడ్ , వరంగల్ రవి, నాగన్న, అముగోత్ వెంకటేశ్ , రాములు యాదవ్ , దాస్ గౌడ్ , కరుణాకర్ గౌడ్ , గూడూరు రోహిత్ , బండ శంకర్ , కోలా వెంకటేశ్ , దినేష్ సాగర్ ముదిరాజ్ , గోపాల్ రెడ్డి, దండెం రామి రెడ్డి, శిరికొండ మల్లేష్ , కోట శ్రీనివాస్ ను ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ.
Also Read : MLA Raja Singh : కాషాయం నా బ్లడ్ లో ఉంది – రాజా సింగ్