Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం

మధ్యప్రదేశ్ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం

Madhya Pradesh :  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌ కు శనివారం నాడు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కేందుకు సిద్ధమవుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌ కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేయడంతో సీఎంకు ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి బసచేసిన హింగ్లాజ్ రిసార్ట్ సమీపంలో శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. మంద్‌సౌర్‌లోని గాంధీ నగర్ ఫారెస్ట్ రిట్రీట్ వద్ద… ముఖ్యమంత్రి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేసి, ముఖ్యమంత్రి ట్రాలీని పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో వెంటనే ఆయణ్ని అక్కడి నుంచి భద్రతా సిబ్బంది తరలించారు.

Madhya Pradesh  CM Accient

కాగా, ఈ ఘటనపై మంద్‌సౌర్ జిల్లా కలెక్టర్ అదితి గార్గ్ వివరణ ఇచ్చారు. మంటలు వచ్చినట్టు వచ్చిన కథనాలు పూర్తిగా తప్పని అన్నారు. బెలూన్‌ను పరిశీలించేందుకే సీఎం వచ్చారని, సీఎం బెలూన్ ఎక్కలేదని చెప్పారు. మంటలు రావడంపై మాట్లాడుతూ, బెలూన్‌ను లిఫ్ట్ చేసేందుకు అందులోని గాలిని హీట్ చేయడం అనేది స్టాండర్డ్ ప్రాసెస్ అని చెప్పారు. ఏడేళ్ల అనుభవం ఉన్న బెలూన్ పైలెట్ మహమ్మద్ ఇర్ఫాన్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బెలూన్ కోసం ఎల్పీజీ, ఫైర్‌ప్రూఫ్ కెవ్లార్ మెటీరియల్ వాడతామని, పూర్తి భద్రతా ప్రమాణాలకు లోబడి ఈ ప్రక్రియ ఉంటుందని చెప్పారు.

శుక్రవారం సీఎం గాంధీ సాగర్ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చంబల్ ఆనకట్ట బ్యాక్ వాటర్ ప్రాంతంలో క్రూయిజ్ రైడ్ చేశారు. గాంధీ సాగర్ ఫారెస్ట్ రిట్రీట్ అనేది మధ్యప్రదేశ్ (Madhya Pradesh) టూరిజం బోర్డు ప్రధాన ప్రాజెక్ట్. ఇది హాట్ ఎయిర్ బెలూనింగ్, పారామోటరింగ్, వాటర్ స్పోర్ట్స్‌కు ప్రసిద్ధి చెందింది.

Also Read : Anurag Thakur: పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ల విషయంలో వైఖరి మారలేదు – అనురాగ్ ఠాకూర్

Leave A Reply

Your Email Id will not be published!