Madhya Pradesh: ఛాన్సలర్‌ ను ‘కులగురు’గా మారుస్తూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం !

ఛాన్సలర్‌ ను ‘కులగురు’గా మారుస్తూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం !

Madhya Pradesh: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ‘వైస్‌ ఛాన్సలర్‌’ పదవి పేరును ‘కులగురు’గా మార్చే ప్రతిపాదనకు మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మన సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధాన్ని ఏర్పరుస్తుందని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలను ఇకపై కులగురువులుగా సంబోధించనున్నట్లు వెల్లడించారు. ఈ నెలలో గురుపౌర్ణమి వేళ ఈ నిర్ణయం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పారు.

Madhya Pradesh Govt

‘‘కులపతి అనే పదం అప్పుడప్పుడు ఇబ్బందులకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆ స్థానంలో ఉన్న మహిళల జీవిత భాగస్వాములను ‘కులపతి’ భర్తలుగా పేర్కొనడం వారికి ఇబ్బందికరంగా మారింది’ అని సీఎం యాదవ్‌ తెలిపారు. ‘కులగురు’ ప్రతిపాదనపై ఇతర రాష్ట్రాలూ ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ హయాంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన యాదవ్… వీసీ హోదాను ‘కులగురు’గా మార్చాలని ప్రతిపాదించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఎట్టకేలకు ఆ ప్రతిపాదనకు మంత్రి మండల ఆమోదం తెలిపింది.

Also Read : MLC Kavitha Case : కవిత బెయిల్ బెయిల్ ఆశలపై నీళ్లు చల్లిన ఢిల్లీ హైకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!