Bus Accident : మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం , నదిలో పడిన బస్సు
Bus Accident : మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు నర్మదా నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…
మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పుణె వెళ్తోన్న ఓ బస్సు.. ధార్ జిల్లాలోని ఖాల్‌ఘాట్ ప్రాంతంలో నర్మదా నది వంతెనపై వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టి నదిలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.
సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, స్థానిక యంత్రాంగం ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతిచెందగా.. 15 మందిని కాపాడినట్లు రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
Also Read : సిసలైన బీజేపీ సర్కార్ నడపడం లేదు
My Deepest Condolences 😰🙏🙏
12 people lost their life due to, the bus felt to Narmada river #busaccident at #MadhyaPradesh
Rest In Peace🙏 #Accident #KabirSingh Muslim PM "Abdul Kalam" pic.twitter.com/Z3Etm5zVzV— lydiaapynz (@ludiaapynz) July 18, 2022