Maha Kumbh Mela: కుంభమేళాలో ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన బబ్బర్ ఖల్సా ఉగ్రవాది అరెస్టు
కుంభమేళాలో ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన బబ్బర్ ఖల్సా ఉగ్రవాది అరెస్టు
Maha Kumbh Mela : ప్రయాగ్ రాజ్ వేదికగా ప్రపంచంలో అతిపెద్ద హిందూ ధార్మిక కార్యక్రమం మహా కుంభమేళా అత్యంత ఘనంగా జరిగింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక కార్యక్రమం కావడంతో పటిష్టమైన భద్రత మధ్య ఈ మహా కుంభమేళాను నిర్వహించింది. ఈ నేపథ్యంలో మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన, ఐఎస్‌ఐతో సంబంధాలున్న బబ్బర్ ఖల్సాకు చెందిన క్రియాశీల ఉగ్రవాదిని ఉత్తర్‌ప్రదేశ్ లోని కౌశాంబిలో గురువారం పోలీసులు పట్టుకున్నారు. బబ్బర్ ఖల్సాకు చెందిన ఈ ఉగ్రవాది… కుంభమేళాలో అలజడి సృష్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. అయితే ఉత్తర ప్రదేశ్ పోలీసుల ముంది ఇతని పాచికలు పారలేదు. ఈ నేపథ్యంలో అత్యంత విశ్వసనీయ సమాచారంతో ఈ బబ్బర్ ఖల్సా ఉగ్రవాదిని అరెస్ట్ చేసారు.
Maha Kumbh Mela..
ఈ మేరకు లఖ్‌నవూలో యూపీ డీజీపీ ప్రశాంత్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ… ‘‘పంజాబ్ అమృత్‌సర్‌లోని కుర్లియన్ గ్రామానికి చెందిన లాజర్ మసీహ్ కు పాకిస్థాన్‌లోని ముగ్గురు ఐఎస్‌ఐ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. ఆయుధాలు, హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో గతంలో ఒకసారి జైలుకు వెళ్లిన మసీహ్… అనారోగ్యంతో చికిత్స పొందుతూ 2024 సెప్టెంబరు 24న ఆసుపత్రి నుంచి పారిపోయాడు. తర్వాత సోనీపత్, ఢిల్లీలలో తలదాచుకున్నాడు. గతంలో పీలీభిత్ లో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వినేశ్ సింగ్ అలియాస్ రవితో అతనికి సంబంధాలున్నాయి.
అమెరికాలో ఉంటున్న ఖలిస్థాన్ ఉగ్రవాదితో, ఖతార్ లో తలదాచుకుంటున్న మరో ఉగ్రవాదితోనూ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అతని కదలికలపై సమాచారంతో కౌశాంబిలోని కోఖ్రాజ్ ఠాణా పరిధిలో పంజాబ్ పోలీసులతో కలిసి ఉత్తర్‌ప్రదేశ్ ఎస్‌టీఎఫ్ బృందం సభ్యులు గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు దాడిచేసి పట్టుకున్నారు. అతని నుంచి మూడు గ్రనేడ్లు, రెండు డిటోనేటర్లు, విదేశీ తయారీ పిస్తోల్, 13 క్యాట్రిడ్జ్‌లు, పేలుడు స్వభావమున్న పౌడర్, సిమ్ లేని ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మహాకుంభమేళాలో భద్రత ఎక్కువగా ఉండటంతో అతడి ఉగ్రదాడి ప్రణాళిక పారలేదు. దీంతో అక్కడి నుంచి పారిపోయాడు’’ అని వివరించారు.
Also Read : Shahabuddin Razvi: టీమిండియా బౌలర్ షమీ పై ముస్లిం మతపెద్ద సంచలన వ్యాఖ్యలు !