Mahabubnagar: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్ యువకుడి మృతి
అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్ యువకుడి మృతి
Mahabubnagar : అమెరికాలో మహబూబ్‌నగర్ యువకుడు మృతి చెందాడు. అయితే, తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్‌ను పోలీసులు కాల్చి చంపారని… పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు.
Mahabubnagar Youth Killed in America
మహబూబ్‌నగర్ (Mahabubnagar) రామయ్య బౌలికి చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్… డిసెంబర్ 2016లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి కాలిఫోర్నియాలోని శాంటా క్లారాకు వెళ్లాడు. ఆ యువకుడిని శాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారు. మృతదేహం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని ఓ ఆసుపత్రిలో ఉందని తమకు తెలిసిందని… తమ కుమారుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్‌కు తీసుకురావడంలో సాయం చేయాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత కాన్సులేట్ ద్వారా సంప్రదింపులు జరపాలని అభ్యర్థించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో రోబో సర్వర్
శంషాబాద్ విమానాశ్రయం లోపల ప్రయాణికుల చెంతకే వారు ఆర్డర్ చేసిన ఆహారపదార్థాల్ని తీసుకొచ్చి అందజేసే… రోబోను నిర్వాహకులు ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నాలుగు చక్రాల ఈ రోబోకు సంబంధించిన కియోస్క్ దగ్గరకు వెళ్లి స్కాన్ చేసి మనకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసి… వెయిటింగ్ సీట్లలో కూర్చోవచ్చు. లేదంటే ఈ రోబో వెళుతున్నప్పుడు దానిపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మనకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. వెంటనే సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ప్రయాణికులు ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల్ని… విమానాశ్రయం లోపలున్న మినర్వా కాఫీషాప్, పిస్తాహౌస్, యునైటెడ్ కిచెన్స్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ల నుంచి తెస్తుంది. ఆర్డర్ చేసిన వారున్న చోటుకు కచ్చితంగా చేరేందుకు కృత్రిమమేధ సాయంతో మ్యాపింగ్ చేశారు. ఓటీపీ చెప్పగానే రోబో తలుపు తెరుచుకుంటుంది.
Also Read : Donald Trump: టారిఫ్ పై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ ?
