Bhagat Singh Koshyari Modi : మోడీజీ ప్లీజ్ సెల‌వు ఇప్పించండి

మ‌రాఠా గ‌వ‌ర్న‌ర్ షాకింగ్ నిర్ణ‌యం

Bhagat Singh Koshyari Modi : నిత్యం వివాదాల‌కు కేంద్ర బిందువుగా ఉంటూ వ‌చ్చిన మ‌రాఠా గ‌వ‌ర్న‌ర్ కోశ్యారీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తాను ముళ్ల కిరీటం ధ‌రించాన‌ని ఇక శేష జీవితం ప్రశాంతంగా గ‌డ‌పాల‌ని కోరుకుంటున్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి విన్న‌వించడం ఆస‌క్తిని రేపుతోంది. ఈ అనుకోని నిర్ణ‌యం షిండే, భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ ను ఆలోచ‌న‌లో ప‌డేస్తే ప్ర‌తిపక్షాలు మాత్రం ఇదంతా ఓ డ్రామా అంటూ కొట్టి పారేస్తున్నాయి.

భార‌త దేశానికి ఆర్థిక రాజ‌ధానిగా పేరొందిన మ‌హారాష్ట్ర‌కు గ‌వ‌ర్న‌ర్ గా కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా నిత్యం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, నిర్ణ‌యాల‌తో వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చారు భ‌గ‌త్ సింగ్ కోశ్యారీ(Bhagat Singh Koshyari) . దేశంలో ఈయ‌న ఒక్క‌రే అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. బిజేపీయేత‌ర రాష్ట్రాల‌లో సేమ్ సీన్ కంటిన్యూ అవుతూ వ‌స్తోంది.

కేర‌ళ‌లో విజ‌య‌న్ వ‌ర్సెస్ ఆరీఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్, త‌మిళ‌నాడులో ఎంకే స్టాలిన్ వ‌ర్సెస్ ఆర్ఎన్ ర‌వి, ఛ‌త్తీస్ గ‌ఢ్ లో భూపేష్ బ‌ఘేల్ వ‌ర్సెస్ గ‌వ‌ర్నర్ , జార్ఖండ్ లో హేమంత్ సోరేన్ వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ , తెలంగాణ‌లో కేసీఆర్ వ‌ర్సెస్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ , ఇలా ప్ర‌తి చోటా కిరికిరి కొన‌సాగుతూనే ఉంది.

త‌మిళ‌నాడులో ఏకంగా గెట‌వుట్ ర‌వి అంటూ పోస్ట‌ర్లు కూడా వెలిశాయి. ఈ కీల‌క స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి త‌న‌ను గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని పీఎంను కోరారు భ‌గ‌త్ సింగ్ కోశ్యారీ(Bhagat Singh Koshyari) . మొత్తం 40 నెల‌ల పాటు ఉన్నారు. ఈయ‌న కాలంలో ముగ్గురు సీఎంలు మారారు. పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, రాయ‌డంపై ఫోక‌స్ పెడ‌తాన‌ని త‌న‌కు సెల‌వు ఇప్పించాల‌ని కోరిన‌ట్లు స‌మాచారం.

Also Read : ఈపీఎస్..ఓపీఎస్ లాగా జీవించొద్దు – స్టాలిన్

Leave A Reply

Your Email Id will not be published!