Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలకు అంతర్జాతీయ గుర్తింపు
మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలకు అంతర్జాతీయ గుర్తింపు
Maharashtra : మహారాష్ట్రలోని పుణె జిల్లా ఖేడ్ తాలూకాలో ఉన్న జలీందర్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. పాఠశాలలో కేవలం ముగ్గురు విద్యార్థులు ఉన్న కారణంగా మూసేద్దామని 2022లో అధికారులు నిర్ణయించాగా…ఒక అనూహ్య నిర్ణయం దాని తలరాతను మార్చేసింది. అంతేకాదు… ‘ప్రపంచ అత్యుత్తమ పాఠశాల అవార్డు’కు పోటీపడేలా చేసింది. ఓ వివాదం కారణంగా పనిష్మెంట్ కింద ఆ పాఠశాలకు వచ్చిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు దత్తాత్రేయ్ వరే… దాని చరిత్రను మార్చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Maharashtra School Beecoms Intrnational Recognization
పుణె (Pune) జిల్లా ఖేడ్ తాలూకాలో ఉన్న జలీందర్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో కేవలం ముగ్గురు విద్యార్ధులు మాత్రమే చదువుతుండటంతో అధికారులు ఆ పాఠశాలను (School) మూసివేయాలని దాదాపు నిర్ణయించారు. అయితే అదే సమయంలో ఓ వివాదంలో చిక్కుకున్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు దత్తాత్రేయ్ వరేను ప్రభుత్వం… ఆ పాఠశాలకు బదిలీ చేసింది. దీనితో ఆ పాఠశాల బాధ్యతలు చేపట్టిన వెంటనే గురూజీగా పిలుచుకునే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు దత్తాత్రేయ్ వరే… బోధనలో ఆధునాతన పద్ధతులను ప్రవేశపెట్టారు. ‘సబ్జెక్ట్ ఫ్రెండ్’ విధానాన్ని అమలు చేశారు. ఒకరి నుంచి మరొకరు నేర్చుకునేలా పీర్-లెర్నింగ్ పద్ధతిని అనుసరించారు. దీనితో మూడేళ్లలోని ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 120కి చేరింది. స్థానికుల సహకారంతో పాఠశాల మౌలిక వసతులను పునర్వ్యవస్థీకరించారు.
కఠిన ఇంటర్వ్యూలు, అస్సెస్‌మెంట్ల అనంతరం జలీందర్ నగర్ పాఠశాల… ప్రపంచ అత్యుత్తమ పాఠశాల అవార్డు పోటీలో టాప్ 10లో నిలిచింది. బ్రిటన్ లోని టీ4 ఎడ్యుకేషన్ ఈ పోటీలను నిర్వహిస్తోంది. మన దేశం నుంచి ఈ పోటీలకు ఎంపికైన ఒకే ఒక్క పాఠశాల జలీందర్ నగర్ ది కావడం విశేషం. కోడింగ్, ప్రోగ్రామింగ్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ పాఠ్యాంశాలను ఈ పాఠశాలలో బోధిస్తున్నారని టీ4 సంస్థ వెల్లడించింది. స్థానికంగా ఉన్న నిపుణులు, తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి.. ఎలక్ట్రానిక్స్, కార్పెంటరీ, ప్లంబింగ్‌తోపాటు భాషల్లో శిక్షణ ఇస్తున్నారని వివరించింది.
మనమంతా ఓటేస్తే గెలుపు
ప్రపంచ అత్యుత్తమ పాఠశాలను తదుపరి జరిగే పబ్లిక్ ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారని దత్తాత్రేయ్ వరే తెలిపారు. ప్రజలంతా ముందుకు వచ్చి ఓటేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోటీలో ఉన్న మిగిలిన 9 పాఠశాలలు బ్రెజిల్, బ్రిటన్, దుబాయ్, పాకిస్థాన్, ఇటలీ, కోస్టారికా, అర్జెంటీనా దేశాల నుంచి ఉన్నాయి.
Also Read : Justice Varma: జస్టిస్ వర్మను తొలగించడమే మేలు – సుప్రీంకోర్టు విచారణ కమిటీ
