CM Maharastra : ముంబై అండర్ వరల్డ్ డాన్ పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం, సహాయకుల కార్యకలాపాలతో ముడి పడి ఉన్న మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి మంత్రి నవాబ్ మాలిక్ ను ఈడీ ప్రశ్నించింది.
అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా విచారణ అనంతరం బయటకు వచ్చిన నవాబ్ మాలిక్ తలవంచను పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు.
మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. గ్యాంగ్ స్టర్ దావూద్ సహచరులతో భూ ఒప్పందాలు చేసుకున్నాడని ఆరోపణలున్నాయి.
శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండడంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే(CM Maharastra) హోం శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఇదే సమయంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నవాబ్ మాలిక్.
ఈ తరుణంలో కేంద్రాన్ని ప్రశ్నించినందుకు, నిలదీసినందుకే మంత్రిని ఇబ్బందికి గురి చేశారని, అరెస్ట్ చేశారని ఆరోపించారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ఈ తరుణంలో కాంగ్రెస్ , ఎన్సీపీ, శివసేన పార్టీల ఆధర్వంలో మహా వికాస్ అగాధీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
నవాబ్ మాలిక్ దావూద్ ఇబ్రహీంతో ఉన్న సంబంధాల గురించి అరెస్ట్ చేశారని బీజేపీ అంటోంది. సాయంత్రం కేబినెట్ తో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించనున్నారు సీఎం. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ బీజేపీ నాయకులను వదిలి పెట్టే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ మీటింగ్ లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన చీఫ్ లు పాల్గొననున్నారు.
Also Read : మనీ లాండరింగ్ కేసులో నవాబ్ మాలిక్ అరెస్ట్