Maharastra Cabinet : మంత్రివ‌ర్గ కూర్పుపై షిండే స‌ర్కార్ ఫోక‌స్

బీజేపీకి 25 షిండే వ‌ర్గానికి 13 ప‌ద‌వులు

Maharastra Cabinet : మ‌రాఠా అసెంబ్లీలో బ‌ల ప‌రీక్ష నెగ్గిన సీఎం ఏక్ నాథ్ షిండే, భార‌తీయ జ‌న‌తా పార్టీ సంయుక్త ప్ర‌భుత్వం ముందు క్యాబినెట్(Maharastra Cabinet) కూర్పు ప‌రీక్ష‌గా మారింది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు కొత్త‌గా కొలువు తీరిన మంత్రివ‌ర్గంలో క‌నీసం 48 మంది మంత్రుల‌కు చోటు క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిసింది.

ఇందులో ఎక్కువ సంఖ్య‌లో స‌భ్యులు క‌లిగిన బీజేపీకి 25 మంందికి మంత్రులుగా, తిరుగుబాటు ప్ర‌క‌టించిన ఏక్ నాథ్ షిండే టీం నుంచి 13 మందికి చాన్స్ ద‌క్క‌నుంది.

ఇప్ప‌టికే కీల‌క శాఖ‌ల‌న్నీ సీఎం, డిప్యూటీ సీఎం వ‌ద్దే ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా ఎవ‌రు మంత్రులుగా ఉండాల‌నేది బీజేపీ నుంచి హైక‌మాండ్ నిర్ణ‌యించ‌నుంది.

ఇదే స‌మ‌యంలో నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావం కార‌ణంగా మ‌హారాష్ట్ర‌లో భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కొండ చ‌రియ‌లు విరిగి ప‌డ్డాయి. జ‌న జీవ‌నం అస్తవ్య‌స్త‌మైంది.

ఇదిలా ఉండ‌గా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం ఏక్ నాథ్ షిండే ఆదేశించారు. ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లో మ‌హారాష్ట్ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సాధించాల‌ని ఈ మేర‌కు గెలుపు గుర్రాలు ఎవ‌ర‌నే దానిపై గుర్తించి వారికి ప‌ద‌వులు ఇవ్వాల‌నేది బీజేపీ ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇందులో భాగంగా కొత్త ముఖాల‌కు మంత్రివ‌ర్గంలో చాన్స్ ఇచ్చేందుకే ప్ర‌యారిటీ ఇవ్వ‌నున్నారు. తిరుగుబాటు చేసిన శివ‌సేన ఎమ్మెల్యేల‌లో 13 మంది ఎవ‌రు ఉంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

ఉద్ద‌వ్ ఠాక్రే సార‌థ్యంలోని మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టి ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) సీఎంగా కొలువుతీరారు.

Also Read : ఇంటి వాడైన భ‌గ‌వంత్ మాన్

Leave A Reply

Your Email Id will not be published!