Mahesh Kumar Goud: మాజీ మంత్రి కేటీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి కేటీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Mahesh Kumar Goud : మాజీ మంత్రి కేటీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పదేళ్లు పాటు తెలంగాణాను పాలించిన కేసీఆర్(KCR) కుటుంబం… వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అంతేకాదు ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ ఫ్యామిలీపై సీబీఐతో విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేటీఆర్ మాట్లాడే మాటలకు చిన్న పిల్లలు సైతం నవ్వుకుంటున్నారన్నారు. పదేండ్లలో భూ దోపిడి చర్చకు సిద్ధమా ? దమ్ము ధైర్యముంటే చర్చకు రండంటూ కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు.
Mahesh Kumar Goud Sensational Comments
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మాట్లాడుతూ… ‘‘గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాలను కేసీఆర్(KCR).. తన వారికి అప్పనంగా అమ్ముకున్నారు. కంచ గచ్చిబౌలి భూముల గురించి పదేళ్లలో ఎందుకు పోరాడలేదు. హెచ్‌సీయూ భూములైతే… కోర్టు వివాదంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఐఎంజీ సంస్థ బిల్లీరావుతో కమీషన్ మాట్లాడుకొని భూముల గరించి పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక సుప్రీంకోర్టులో పోరాడి 400 ఎకరాలను సాధించాం. ఈ ప్రభుత్వం కాపాడకుంటే 400 ఎకరాల భూమి ఐఎంజీ చేతికి వెళ్లి ఉండేది. బిల్లీరావుతో మాట్లాడుకున్న రూ. వేల కోట్ల కమీషన్ పోయిందనే అక్కసుతోనే కేటీఆర్ మాట్లాడుతున్నారు.
ఏ ప్రభుత్వం అయినా ఒక సంస్థ ద్వారానే రుణాలు సేకరిస్తుంది. కోకాపేటలో వేల ఎకాలను రూ.100 కోట్లకు ఎకరం చొప్పున అమ్ముకోలేదా? టీజీఐఐసీ ద్వారా తీసుకున్న రూ.10వేల కోట్ల రుణాలతో రైతులకు రుణమఫీ చేసింది ఈ ప్రభుత్వం. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం వేల ఎకరాలు అమ్ముకున్నప్పుడు పర్యావరణం గుర్తుకురాలేదా ? పదేళ్లలో లక్ష ఎకరాలను డీఫారెస్ట్ చేసి అమ్ముకున్నారు. 400 ఎకరాల భూముల్లో కంపెనీలు నిర్మిస్తే… రాష్ట్ర ప్రజలకు లక్షల ఉద్యోగాలు వస్తాయి. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన భూదోపిడీపై బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా?’’ అని మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబంపై సీబీఐతో విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. చాలా తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ధనం దోపిడి చేసింది కేసీఆర్ కుటుంబమేనని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు.
బిల్లీ రావుతో కేటీఆర్ ఒప్పందం చేసుకున్నాడని పేర్కొన్నారు. కేటీఆర్ గుంటూరులో ఏం చదువు నేర్చుకున్నాడో అర్థం కావడం లేదన్నారు. సగం సగం తెలుసుకొని రాజకీయ లబ్ది కోసం కేటీఆర్ మాట్లాడుతారంటూ ఎద్దేవా చేశారు. బీసీ కుల గణన వల్ల బీఆర్ఎస్ పార్టీలో వణుకు పుట్టిందన్నారు. బీఆర్ఎస్ పదేండ్లలో ఎన్ని వేల ఎకరాలను కొల్లగొట్టారో తెలియదా? అంటూ ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతులు బాగు పడుతుంటే కేటీఆర్‌కి కడుపు నొప్పి వస్తోందని ఎద్దేవా చేశారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు చేయించి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పంపారంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. తెలంగాణకి ఉద్యోగాలు రాకూడదా? అంటూ బీఆర్ఎస్ నేతలు సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ దోపిడీని భరించ లేకనే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించారన్నారు. గత పదేండ్లలో జరిగిన భూ దోపిడీపై విచారణ జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ, బిఅర్ఎస్ నేతలు కడుపు మంటతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కానీ దానిని తాను వివాదం చేయదలుచుకో లేదన్నారు. ప్రతిపక్షాలు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాయన్నారు. కడుపు నిండా భోజనం పెట్టె కార్యక్రమం తాను ప్రారంభిచడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సన్నబియ్యంపై ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుందని చెప్పారు. ఎవరో ఒకరు విమర్శలు చేసి దాని సాంటిటిని దెబ్బతియ్యవద్దంటూ ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. మంచి ఫైన్ రైస్ బీఅర్ఎస్ కానీ… బీజేపీ కానీ గతంలో ఇచ్చారా? అంటూ ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
Also Read : PM Narendra Modi: తహవ్వుర్ రాణా అప్పగింతపై మోదీ పాత పోస్టు వైరల్