Mallikarjun Kharge : రైతన్నలకు కాంగ్రెస్ భరోసా
ప్రకటించిన ఏఐసీసీ చీప్ ఖర్గే
Mallikarjun Kharge : హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విజయ భేరి సభను నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి అశేషంగా జనం తరలి వచ్చారు. సభా ప్రాంగణం పూర్తిగా నిండి పోయింది.
Mallikarjun Kharge Commitment
లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ప్రసంగించారు. రైతులకు తీపి కబురు చెప్పారు . రూ. 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కౌలు రైతులకు రూ. 12,500 ఇస్తామన్నారు. అంతే కాకుండా విత్తనాల కొనుగోలు కోసం రూ. 500 అదనంగా ఇస్తామని స్పష్టం చేశారు.
కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. బయట కొట్లాడు కుంటున్నట్లు నటిస్తున్నారని కానీ లోలోపట ఇరు పార్టీలు కలిసి పోయాయని సంచలన ఆరోపణలు చేశారు మల్లికార్జున్ ఖర్గే.
మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని మండి పడ్డారు. దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధనవంతులకు, వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారంటూ ఆరోపించారు మల్లికార్జున్ ఖర్గే.
Also Read : Sonia Gandhi : తెలంగాణ మహిళలకు సోనియా నజరానా