Mallikarjun Kharge : ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
హాజరైన ఖర్గే..రాహుల్..ప్రియాంక
Mallikarjun Kharge : నాగ్ పూర్ – మరాఠా లోని నాగ్ పూర్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ , కేసీ వేణుగోపాల్ , వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీనియర్ నాయకులు హాజరయ్యారు.
Mallikarjun Kharge Comment
ఈ సందర్బంగా ఖర్గే ఉత్సవాలను పురస్కరించుకుని ప్రసంగించారు. ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి విస్మరించ లేని చరిత్ర ఉందన్నారు. పార్టీ పరంగా వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ తరుణంలో మనందరం మరోసారి ఒకే చోట చేరడం ఆనందంగా ఉందని స్పష్టం చేశారు మల్లికార్జున్ ఖర్గే.
ప్రస్తుతం త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని, ప్రతి ఒక్కరు మరింత రెట్టించిన ఉత్సాహంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదన్నారు. కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలు అంటూ కొనియాడారు.
వ్యవస్థలను ధ్వంసం చేస్తూ ఆక్టోపస్ లా విస్తరించిన భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు మనందరం ప్రయత్నం చేయాలని అన్నారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు ఖర్గే.
Also Read : Achechennaidu : హామీల అమలులో నిర్లక్ష్యం