Mallikarjun Kharge : మోదీ మౌనం సిగ్గుచేటు – ఖర్గే
మణిపూర్ పై మౌనం ఏల
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాల ఆధ్వర్యంలో సోమవారం పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టారు. గత మే 3 నుంచి మణిపూర్ మండుతున్నా ఇప్పటి వరకు కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఖర్గే.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రధాన మంత్రి సభ వెలుపల ప్రకటన చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు ఏఐసీసీ చీఫ్. ఒక బాధ్యత కలిగిన ప్రధాన మంత్రి ఇలా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mallikarjun Kharge Words
మోదీ కొలువు తీరిన 9 ఏళ్ల కాలంలో అత్యధికంగా మణిపూర్ లో , దేశంలోని ఇతర ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లాయని ఆరోపించారు ఖర్గే(Mallikarjun Kharge). ఓ వైపు మణిపూర్ తగలబడి పోతుంటే ప్రధానమంత్రి విదేశాలలో పర్యటించారని ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
మణిపూర్ లో వాస్తవంగా పరిస్థితి ఎలా ఉందనే విషయంపై పార్లమెంట్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని రాజ్య సభ చైర్మన్ , లోక్ సభ స్పీకర్ ను కోరుతున్నామన్నారు మల్లికార్జున్ ఖర్గే.
ఇదిలా ఉండగా ఇప్పటి దాకా 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినా పట్టించు కోక పోవడం దారుణమన్నారు. 300 మందికి పైగా గాయపడి , శిబిరాలలో తలదాచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కేంద్ర మంత్రి ఉన్నారా లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
Also Read : AP CM YS Jagan : యుద్ద ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం