Mallikarjun Kharge : ఎస్సీ,ఎస్టీల అభివృద్దే లక్ష్యం – ఖర్గే
చేవెళ్ల ప్రజా గర్జన సభలో ఏఐసీసీ చీఫ్
Mallikarjun Kharge : ఎస్సీ, ఎస్టీల అభివృద్దే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). చేవెళ్ల వేదికగా జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు ఎస్సీ, ఎస్టీ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ విడుదల చేశారు.
Mallikarjun Kharge Promiss SC, ST to Develop
ఈ దేశంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం అణగారిన, బహుజనులను పట్టించు కోవడం లేదన్నారు. కానీ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల గురించి, నిమ్న వర్గాల సంక్షేమం , అభ్యున్నతి కోసం కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు మల్లికార్జున్ ఖర్గే.
ఇక రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించు కోవడం లేదన్నారు. కేవలం ప్రచారం తప్ప పనులు చేసిన పాపాన పోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా గెలవబోయేది తామేనన్నారు.
బీఆర్ఎస్ , బీజేపీ రెండూ ఒక్కటేనని కానీ పైకి మాత్రం నటిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని, ఓటు అనే ఆయుధాన్ని జాగ్రత్తగా వినియోగించు కోవాలని సూచించారు ఏఐసీసీ చీఫ్. ఇదిలా ఉండగా ఎస్టీల వర్గీకరణ విషయంపై నోరు మెదపలేదు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయనపై లంబాడాలు ఆగ్రహంతో ఉన్నారు.
Also Read : Bhatti Vikramarka : పేదల పొట్ట కొట్టిన కేసీఆర్