Mallikarjun Kharge: ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్ధిగా మల్లిఖార్జున ఖర్గే ?
ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్ధిగా మల్లిఖార్జున ఖర్గే ?
Mallikarjun Kharge: ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ప్రతిపాదించారు తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మమతా బెనర్జీ ప్రతిపాదనను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎండిఎంకే చీఫ్ వైకో మద్దత్తు తెలిపారు. అయితే, మల్లిఖార్జున ఖర్గే మాత్రం ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరష్కరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేద్దామని.. ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని ఈ సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పష్టం చేశారు. ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి నాలుగో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై కీలకంగా చర్చించారు. ప్రధాని అభ్యర్థి అంశంపైనా ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ప్రధానమంత్రి అభ్యర్ధిగా తన పేరు ప్రస్తావించడం పట్ల మల్లిఖార్జు ఖర్గే వారించారు. ఎన్నికల తర్వాతనే ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేసారు.
Mallikarjun Kharge Viral
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు… ఇండియా కూటమి ఆశించిన విధంగా ఉండకపోవడంతో పాటు డిసెంబర్ 13న జరిగిన లోక్‌సభ భద్రతా ఉల్లంఘనపై నిరసనలు, నినాదాలు చేసినందుకు వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో నాలుగో సమావేశంజరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, శరద్ పవార్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, ఉద్దవ్ థాక్రే, ఇతర పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు.
Also Read : CM Jagan: సీఎం జగన్ ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు !