Mallikarjun Kharge : కన్నడ నాట కాంగ్రెస్ జెండా ఎగరాలి
బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి
Mallikarjun Kharge : కన్నడ నాట ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. త్వరలో రాస్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని బీజేపీ చేస్తున్న అవినీతి, అక్రమాలను నిలదీయాలని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించాలని కోరారు.
ఏఐసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కర్ణాటక లోని తన స్వంత పట్టణం కలబురగికి వచ్చారు . ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ ప్రచారం ఎక్కువ పని తక్కువ అని ఎద్దేవా చేశారు. పబ్లిక్, సెమీ గవర్నమెంట్ , ఎయిడెడ్ , పోలీస్ , బ్యాంకింగ్ రంగాల్లో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు.
ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు మల్లికార్జున్ ఖర్గే. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉందని , ఎన్నికలను ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంను, మంత్రులు ఎవరు ఉండాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు.
అంత దాకా ఓపికతో ఉండాలని సూచించారు. నాకు అత్యున్నత పదవి కట్టబెట్టింది పార్టీ. మీరు నాకు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తారని నమ్మకం తనకు ఉందన్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం కేవలం పార్టీనేనని పేర్కొన్నారు.
తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో పవర్ లోకి వచ్చేది కాంగ్రస్ అని జోష్యం చెప్పారు ఖర్గే.
Also Read : వ్యవస్థల నిర్వీర్యం దేశానికి ప్రమాదం