Mallikarjun Kharge : పవర్ కంటే ప్రజాస్వామ్యం ముఖ్యం
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : కేంద్రంలో ఒంటెత్తు పోకడ పోతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇవాళ విపక్షాల ఐక్యత ఒక గుణపాఠం కానుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. బెంగళూరులో విపక్షాల కమిటీ ఆధ్వర్యంలో ఒక వేదికను ఏర్పాటు చేశాయి. ఈ సందర్బంగా ఖర్గే(Mallikarjun Kharge) ప్రసంగించారు. 26 పార్టీలు ఐక్యంగా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే వ్యవహరిస్తారని తాను ఆశిస్తున్నానని చెప్పారు ఖర్గే.
Mallikarjun Kharge Said
ఇవాళ అన్ని పార్టీలు కలిసి దేశంలోని 11 రాష్ట్రాలలో ప్రభుత్వాలను కలిగి ఉన్నామన్నారు. అంటే అర్థం తాము కూడా బలమైన ప్రతిపక్షంగా ఉన్నట్టేనని పేర్కొన్నారు. అధికారం ఉంది కదా అని అన్ని వ్యవస్థులను నిర్వీర్యం చేయాలని అనుకుంటే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు.
ప్రతి చోటా అభిప్రాయ భేదాలు అన్నవి సహజమేనని వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు ఏఐసీసీ చీఫ్. గతంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒంటరిగా ఎక్కువ సీట్లు రాలేదన్నారు. కేవలం మిత్రపక్షాలను కలుపుకుంటే ఆ మాత్రం మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా అమ్మే అధికారం మోదీకి ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించారు.
చివరకు భారత రాజ్యాంగం కూడా వద్దనే పరిస్థితికి కేంద్ర సర్కార్ వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు కోవడం కోసం తాము ప్రయత్నం చేస్తామన్నారు.
Also Read : Manmohan Singh : ఊమెన్ చాందీ మాస్ లీడర్