Mallikarjun Kharge : బక్కోడు కాదు బకాసురుడు
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : కల్వకుర్తి – సీఎం కేసీఆర్ మామూలోడు కాదని లక్ష కోట్లు మింగిన బకాసురుడు అంటూ నిప్పులు చెరిగారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజలను బురిడీ కొట్టించిన ఘనుడంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ చీఫ్ సీరియస్ కామెంట్స్ చేశారు.
Mallikarjun Kharge comments on KCR
బీఆర్ఎస్ నేతలు బరి తెగించి మాట్లాడుతున్నారని, వారికి అహంకారం తలకు ఎక్కిందన్నారు. చరిత్రలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్ర వీగిన వాళ్లంతా కాల గర్భంలో కలిసి పోయారని, అడ్రస్ లేకుండా పోయారని హెచ్చరించారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది అంతా తమ హయాంలో జరిగినవే తప్పా బీఆర్ఎస్ పాలనలో జరగలేదన్నారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). కేసీఆర్ నీళ్లు ఇస్తానని పదే పదే చెబుతున్నాడని మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు ప్రారంభం కాలేదన్నారు. ఎందుకు పనులు చేపట్టలేదంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ ను ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంపీగా గెలిపించినా ఎందుకు అభివృద్ది చేయలేక పోయారంటూ నిలదీశారు ఖర్గే. పవర్ ను అడ్డం పెట్టుకుని 10 వేలకు పైగా ఎకరాలను గాయబ్ చేశాడంటూ ధ్వజమెత్తారు.
Also Read : Eatala Rajender : కేసీఆర్ కు ఓటమి భయం
