Mallikarjun Kharge : కేంద్రం టార్గెట్ పూర్తయిందా – ఖర్గే
సంజయ్ రౌత్ అరెస్ట్ పై కాంగ్రెస్ ఎంపీ
Mallikarjun Kharge : కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే. మోదీ, అమిత్ షా , జేపీ నడ్డా త్రయాన్ని టార్గెట్ చేస్తూ వచ్చిన శివసేన అగ్ర నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ ను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు.
ఇకనైనా కోరిక తీరిందా లేక ఇంకా అరెస్ట్ లు చేయాల్సిన వాళ్లు ఎందరున్నారంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ముంబై లోని పత్రా చాల్ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్ ను ఈడీ ప్రశ్నించింది.
అర్ధరాత్రి దాటాక అరెస్ట్ చేసింది. ఇవాళ కోర్టులో హాజరు పర్చనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే సోమవారం ప్రధానంగా ప్రస్తావించారు.
కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. అధికార భారతీయ జనతా పార్టీ కోరుకున్నట్లుగా మహారాష్ట్ర నాయకుడిని లక్ష్యంగా చేసుకున్నారని, ఆపై అతడిని అదుపులో తీసుకోవడం పూర్తయిందన్నారు.
ఇంకా ఎంత మందిని జైళ్లోకి నెట్టాలని చూస్తున్నారో సభా ముఖంగా తెలియ చేస్తే బావుంటుందని సంచలన కామెంట్స్ చేశారు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge).
బీజేపీ సర్కార్ ప్రతిపక్షాలు లేకుండా పార్లమెంట్ ఉండాలని కోరుకుంటోంది. అందుకే సంజయ్ రౌత్ ను కావాలని అదుపులోకి తీసుకుందంటూ మండిపడ్డారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాన సమస్యలు చర్చకు రాకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందంటూ ధ్వజమెత్తారు ఖర్గే. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్యామ్యానికి పాతర వేసే పనిలో ఉన్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Also Read : స్మృతీ ఇరానీ క్షమాపణలు చెప్పాలి