Mallikarjun Kharge LIC : అదానీ గ్రూప్ లాస్ ఎల్ఐసీకి షాక్

భారీ ఎత్తున జీవిత భీమా పెట్టుబ‌డి

Mallikarjun Kharge LIC : అమెరికా రీసెర్స్ సంస్థ హిండెన్ బ‌ర్గ్ కొట్టిన దెబ్బ‌కు ప్రముఖ భార‌తీయ వ్యాపార కంపెనీ అదానీ గ్రూప్ భారీగా న‌ష్ట పోయింది. అదానీ గ్రూప్ స‌మ‌ర్పించిన లెక్క‌ల‌న్నీ త‌ప్పులేనంటూ పేర్కొన‌డంతో ఒక్క‌సారిగా అదానీ గ్రూప్ షేర్లు ప‌డి పోయాయి. దీంతో జ‌న‌వ‌రి 24న రూ. 72,268 కోట్లు న‌ష్ట పోయింది.

ఇదిలా ఉండ‌గా భార‌త దేశంలోని ప్ర‌భుత్వ రంగ సంస్థ జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ) కూడా పెద్ద మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టింది అదానీ గ్రూప్ లో. 9 శాతం వ‌ర‌కు వాటాలు ఉన్నాయి. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఒత్తిడి మేర‌కే ప్ర‌భుత్వ రంగ సంస్థ అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టింద‌ని ఆరోపించారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge LIC).

ఇందులోని ప్ర‌తి పైసా సామాన్యులు, భారతీయులు పెట్టుబ‌డిగా పెట్టార‌న్నారు. రెండు రోజుల్లో రూ. 19,000 కోట్ల న‌ష్టాన్ని చూసింది. ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా పేరును లూట్ ఇన్వెస్ట్ మెంట్ ఫ‌ర్ క్రోనీస్ గా మార్చేసిందంటూ మండిప‌డ్డారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఒక్క ఎల్ఐసీ అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే .

కానీ ఎల్ఐసీతో పాటు దేశంలో అత్యున్న‌త‌మైన ప్ర‌ధాన బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేయ‌డం విస్తు పోయేలా చేసింది. 250 మిలియ‌న్ల‌కు పైగా పాల‌సీ దారుల‌తో ఎల్ఐసీ భార‌త దేశంలో టాప్ లో ఉంది . అదానీ గ్రూప్ కు చెందిన ఐదు కంపెనీల‌లో పెట్టుబ‌డిదారుగా ఉంది. ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే ప్ర‌ధాన‌మంత్రి మోడీపై నిప్పులు చెరిగారు.

Also Read : కాంగ్రెస్ లేకుండా ప్ర‌తిప‌క్ష కూట‌మి లేదు

Leave A Reply

Your Email Id will not be published!