Mallikarjun Kharge-Budget 2025 : కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే గరం

రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి రోడ్ మ్యాప్ లేదని..

Mallikarjun Kharge : కేంద్ర బడ్జెట్ 2025 పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) విమర్శలు గుప్పించారు. యావద్దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో పోరాడుతుంటే కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసించే పనిలో ప్రభుత్వం బిజీగా ఉందని అన్నారు. ప్రజలను మోసగించేలా బడ్జెట్ ఉందని వ్యాఖ్యానించారు. అనేక పాపాలు చేసిన తర్వాత భక్తిమార్గంలో నడవాలనుకుంటున్నట్టుగా ప్రభుత్వ బడ్జెట్ తీరు ఉందన్నారు.

Mallikarjun Kharge Slams

నరేంద్ర మోదీ గత పదేళ్ల పాలనలో మధ్యతరగతి ప్రజానీకం నుంచి రూ.54.18 లక్షల కోట్లు ఆదాయం పన్ను రూపంలో వసూలు చేసిందని, ఇప్పుడు రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు ప్రకటించి ఏడాదికి రూ.80,000 ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి చెబుతున్నారని అన్నారు. యావత్ ప్రజానీకం ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో సతమతమవుతుంటే మోదీ ప్రభుత్వం తప్పుడు ప్రశంసల కోసం పాకులాడుతోందని విమర్శించారు.

బడ్జెట్‌ను’ అనౌన్స్‌మెంట్ మేకింగ్ బడ్జెట్‌’ గా ఖర్గే అభివర్ణిస్తూ, యువకులకు కానీ, మహిళా సాధికారితకు కానీ ప్రకటించినదేమీ లేదని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి రోడ్ మ్యాప్ లేదని, వ్యవసాయ ఉత్పత్తుల జీఎస్‌టీ రేట్లపై కన్షెషన్లు లేవని, ఆరోగ్యం, విద్యపై కానీ, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, పేదలు, మైనారిటీ పిల్లలకు స్కాలర్‌షిప్‌ల విషయమై కానీ ఎలాంటి ప్లాన్‌లు బడ్జెట్‌లో లేవని అన్నారు. ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికి ఎలాంటి సంస్కరణలు లేవని విమర్శించారు.

పేద ప్రజల ఆదాయం పెరిగేందుకు ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతున్నా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ బడ్జెట్ అలానే ఉంచారని, వర్కర్ల ఆదాయంలో పెంపు లేదని అన్నారు. జీఎస్‌టీ మల్టిపుల్ రేట్లపై ఎలాంటి సంస్కరణల ప్రస్తావన లేదని చెప్పారు. నిరుద్యోగిత తగ్గించడం, ఉద్యోగాల కల్పన ఊసే లేదన్నారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్కిల్ ఇండియా అంటూ స్కీమ్‌లన్నీ కేవలం ప్రకటనలే పరిమితం కానున్నాయని ఎద్దేవా చేశారు. మొత్తంగా.. 2025 బడ్జెట్ కేవలం ప్రజలను మోసం చేసేందుకు చేసిన ప్రయత్నమేనని పేర్కొన్నారు.

Also Read : AP Mega DSC 2025 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్

Leave A Reply

Your Email Id will not be published!