Mamata Banerjee : దీదీ జ‌గ‌మెరిగిన ధీర వ‌నిత

మహిళా లోకానికి ద‌ర్ప‌ణం

Mamata Banerjee : భార‌త దేశ రాజ‌కీయాల‌లో ముందుగా ఫైర్ బ్రాండ్ ఎవ‌ర‌ని చెప్పాల్సి వ‌స్తే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది మ‌మ‌తా బెన‌ర్జీ. ముఖ్య‌మంత్రిగా ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్ర చ‌రిత్ర‌లో నూత‌న అధ్యాయానికి శ్రీ‌కారం చుట్టారు.

తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. వ‌రుస‌గా సీఎంగా ఎన్నికై రికార్డు బ్రేక్ చేశారు.

ఎన్నో అవ‌మానాలు, మరెన్నో క‌ష్టాల‌ను దాటుకుని తాను మ‌రోసారి నిజ‌మైన నాయ‌కురాలిన‌ని ప్రూవ్ చేసుకున్నారు మ‌మ‌తా బెనర్జీ(Mamata Banerjee).

క‌మ్యూనిస్టుల కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ బెంగాల్ లో పాగా వేసింది. 1955 జ‌న‌వ‌రి 5న జ‌న్మించిన ఆమె మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందింది. 1970లో రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించింది.

1976 నుంచి 1980 వ‌ర‌కు రాష్ట్ర మ‌హిళా కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి పొందింది. క‌ల‌క‌త్తా యూనివ‌ర్శిటీలో ఎంఏ చ‌దివింది.

లా కూడా పూర్తి చేసింది. జ‌గ మొండిగా, ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది.

ఒక రకంగా ప్ర‌తిప‌క్షాలు, క‌మ్యూనిస్టులు, క‌మ‌ల‌నాథులు ఆమెను శివంగి అని పిలుస్తారు.

ఆమెను బెంగాల్ వాసులు ప్రేమ‌గా దీదీ Mamata Banerjee)అని పిలుచుకుంటారు. 1984లో సోమ‌నాథ చ‌ట్ట‌ర్జీపై పోటీకి దిగింది.

ఇంటింటికి వెళ్లి పేద సాద‌ల‌తో ముచ్చ‌టించింది. వారితో పాటే తేనీరు సేవించి తాను మీ మ‌నిషినంటూ వారిలో క‌లిసి పోయింది.

అట్ట‌డుగు ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైన తీరు ప్ర‌జ‌ల‌ను మెస్మ‌రైజ్ చేసింది.

మ‌మ‌తా బెన‌ర్జీని లోక్ స‌భ‌కు పంపించేలా చేసింది. ఆనాటి నుంచి ఆమెకు ఫైర్ బ్రాండ్ అని పేరు ప‌డింది. ఆనాటి నుంచి నేటి దాకా ఒంట‌రిగానే ఉన్నారు. టాటా కంపెనీకి వ్య‌తిరేకంగా ఉద్య‌మించింది.

రైతు ప‌క్ష‌పాతిగా పేరొందింది. 2011 మే 13న 34 ఏళ్ల సుదీర్ఘ క‌మ్యూనిస్టు పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడింది. బెంగాల్ లో కూక‌టి వేళ్ల‌తో పెకిలించి వేసింది. ఆమె నిరాడంబ‌ర‌తే ఆమెను లీడ‌ర్ గా చేసింది.

మాట‌ల్లో కాదు చేత‌ల్లో చూపించిన ధీర వ‌న‌తిగా పేరు పొందింది. 1996లో త‌న‌పై దాడి జ‌రిగినా ధైర్యంగా ఎదుర్కొంది. అందుకే మ‌మ‌తా బెన‌ర్జీని బెంగాలీయులు దుర్గా మాత‌గా భావిస్తారు.

ప‌శ్చిమ బెంగాల్ చ‌రిత్ర‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి ముఖ్య‌మంత్రిగా కొలువు తీరింది దీదీ. ఆమె భార‌తీయ మ‌హిళా ప్ర‌పంచానికి ఓ దిక్సూచి మాత్ర‌మే కాదు ఓ ఐకాన్ కూడా.

Also Read : ఆత్మ విశ్వాసం ఆమె ఆయుధం

Leave A Reply

Your Email Id will not be published!