Mamata Banerjee : హిందూ మతం పరువు తీస్తున్న బీజేపీ
నిప్పులు చెరిగిన టీఎంసీ చీఫ్ , సీఎం
Mamata Banerjee : టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీ దేశంలో మతం పేరుతో రాజకీయం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. తమకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందంటూ మండిపడ్డారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిర్వహించిన ఊరేగింపుల్లో ఘర్షణ చోటు చేసుకుంది.
పశ్చిమ బెంగాల్ లోని హౌరా , హుగ్లీ జిల్లాల్లో గత వారం రోజుల్లో రెండు హింసాత్మక ఘటనలు జరిగాయి. దీని వెనుక బీజేపీ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు మమతా బెనర్జీ(Mamata Banerjee). మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కాషాయ పార్టీ ఒక వర్గాన్ని మరొక వర్గానికి వ్యతిరేకంగా ఉంచడం ద్వారా హిందూ మతాన్ని పరువు తీస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
హింస అన్నది పశ్చిమ బెంగాల్ సంస్కృతి కాదన్నారు దీదీ. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ గూండాలను నియమించుకుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ శ్రేణుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఖేజురి జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. సీపీఎం , బీజేపీ రెండూ తమకు వ్యతిరేకంగా అల్లర్లు ఎగదోస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీహార్ లో తాము అధికారంలోకి వస్తే అల్లర్లను కంట్రోల్ చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. మరి ఇక్కడ ఎందుకు అదుపు చేయడం లేదని ప్రశ్నించారు మమతా బెనర్జీ. బీజేపీ ఎమ్మెల్యే గాయపడడం అబద్దమని పేర్కొన్నారు.
Also Read : సీఎం నితీశ్ కు పశ్చాతాపం లేదు – ఓవైసీ