Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) , సీబీఐ (CBI), ఐటీ సంస్థలను కావాలని తమపై ప్రయోగం చేస్తోందంటూ మండిపడ్డారు. మోదీ త్రయం కావాలని బీజేపీ యేతర ప్రభుత్వాలను, వ్యక్తులను, సంస్థలను టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించారు దీదీ.
ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో తమ లాంటి వారిని లక్ష్యంగా చేసుకుని ఆటాడుతోందంటూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి దేశంలోని అన్ని ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందంటూ మమతా బెనర్జీ(Mamata Banerjee) పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వెంటనే సమావేశం కావాలని సూచించారు. ప్రగతిశీల శక్తులు ఏకతాటిపైకి వచ్చి కేంద్రంపై పోరాడాలని అన్నారు సీఎం. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కేంద్రం ఈ దర్యాప్తు సంస్థలను ఉపయోగించడం మామూలై పోయిందన్నారు.
ఈ సమయంలో కలిసికట్టుగా ఉద్యమించాలని పేర్కొన్నారు మమతా బెనర్జీ. ఇదిలా ఉండగా బొగ్గు కుంభకోణం కేసులో తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) కి నోటీసులు జారీ చేయడాన్ని తప్పుపట్టారు సీఎం.
మరింత సమయం ఇవ్వాలని కోరారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు , ప్రతీకారం కోసం ఈడీ, సీబీఐ (CBI) , సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (Central Vigilance Commission) ను , ఐటీ వంటి కేంద్ర ఏజెన్సీలను ప్రయోగించడం దారుణమన్నారు.
పక్ష పాత రాజకీయ జోక్యం వల్లే ప్రజలకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : అరుదైన దృశ్యం కత్తుల కరచాలనం