‘మ‌న శంక‌ర్ ప్ర‌సాద్ గారు’ మామూలుగా లేదుగా

కామెడీ, వినోదం పండించిన ద‌ర్శ‌కుడు అనిల్

హైద‌రాబాద్ : ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కేవ‌లం ఇంటిల్లిపాది మొత్తం హాయిగా న‌వ్వుకునేలా, ఆనందం పొందేలా సినిమాలు తీయ‌డంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. త‌ను తీసిన ప్ర‌తి మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. గతంలో విక్ట‌రీ వెంక‌టేశ్ తో తీసిన ఎఫ్ -1 , ఎఫ్ -2 సీక్వెల్ మూవీస్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయి. గ‌త ఏడాది 2025లో వ‌చ్చిన సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. తాజాగా 2026లో సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంకీ, న‌య‌న‌తార న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు సూప‌ర్ స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది. ఇప్ప‌టికే రూ. 150 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇంకా వ‌సూళ్ల వేట కొన‌సాగిస్తోంది.

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి పూర్తిగా వ‌న్ మెన్ షోగా చిత్రాన్ని తెర‌కెక్కించాడు. క‌డుపుబ్బా న‌వ్వించేలా కామెడీ, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఆనందం పొందేలా పాత్ర‌ల‌ను ఎంచుకోవ‌డం, అన్నింటికి మించి ఎలాంటి ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చిరంజీవిని కొత్త గెటప్ లో చూపించ‌డం, వాటికి తోడు న‌య‌న‌తార‌ను ఒప్పించ‌డం, ఇక ఎలాంటి స‌మ‌యంలోనైనా, ఏ పాత్ర‌లోనైనా ఒదిగి పోయే కామెడీని పండించే విక్ట‌రీ వెంక‌టేశ్ ను ఇందులో తీసుకోవ‌డం ప్ల‌స్ పాయింట్ గా నిలిచింది. ఇదే క్ర‌మంలో త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన కమెడియ‌న్ వీటీకే గ‌ణేశ్ ను ప్ర‌త్యేక పాత్ర‌కు ఎంపిక చేశాడు. ఇది కూడా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇదే క్ర‌మంలో బీమ్స్ సిసిరిలియో అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యేలా తోడ్పాటు అందించ‌డంలో కీ రోల్ పోషించాడు.

Leave A Reply

Your Email Id will not be published!