Mandakrishna Madiga : రేవంత్ రెడ్డి కంటే పిట్ట‌ల దొర బెట‌ర్

నిప్పులు చెరిగిన మంద కృష్ణ మాదిగ‌

Mandakrishna Madiga : ఎంఆర్పీఎస్ చీఫ్ మంద‌కృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని తాము డిమాండ్ చేశామ‌న్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌తి పార్టీని క‌లిసి విన‌తిప‌త్రం ఇచ్చామ‌ని తెలిపారు. బుధ‌వారం మంద‌కృష్ణ మాదిగ(Mandakrishna Madiga) మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ జ‌ర‌గాల్సింది ఇక్క‌డ కాదు పార్ల‌మెంట్ లో . ఈ విష‌యం గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

Mandakrishna Madiga Serious Comments

రేవంత్ రెడ్డి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చేస్తామంటే న‌మ్మేందుకు తాము ఏమ‌న్నా చెవుల్లో పూలు పెట్టుకున్నామా అంటూ మంద‌కృష్ణ మాదిగ ఎద్దేవా చేశారు. వ‌చ్చే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఆపార్టీ ఓడి పోతే , అధికారంలోకి రాక పోతే ఆయ‌న ఆ పార్టీలో ఉండ‌డని పేర్కొన్నారు . భార‌తీయ జ‌న‌తా పార్టీలోలో లేక బీఆర్ఎస్ లో చేర‌తాడంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఎందుకు చెబుతున్నానంటే రేవంత్ రెడ్డి ఇప్ప‌టికి మూడు పార్టీలు మారిండు. రేపొద్దున ఇంకెన్ని పార్టీలు మార‌డ‌ని న‌మ్మ‌కం ఏమిటి అని నిల‌దీశారు. ఆయ‌న గ‌తంలో బీజేపీ అనుబంధ సంస్థ‌లో ఉన్నాడ‌ని గుర్తు చేశారు. ఎప్పుడు ఎక్క‌డ ఉంటాడో తెలియ‌ని రేవంత్ రెడ్డి మాట‌ల‌కు ఏం విలువ ఉంటుంద‌ని అన్నారు మంద‌కృష్ణ మాదిగ‌. ఇలాంటోడిని తాము న‌మ్మ‌లేమ‌న్నారు.

Also Read : Supriya Shrinate : మోదీ పాల‌న‌లో అన్నీ స్కామ్ లే

Leave A Reply

Your Email Id will not be published!