Manish Sisodia: సిసోడియా పిటిషన్పై తీర్పు రిజర్వ్ !
సిసోడియా పిటిషన్పై తీర్పు రిజర్వ్ !
Manish Sisodia: లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ పూర్తైంది. సీబీఐ, ఈడీ కేసుల్లో ఆయన బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై వాదనలు పూర్తి కాగా, కోర్టు తీర్పును వాయిదా వేసింది.
Manish Sisodia Case Update
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియా(Manish Sisodia) 17 నెలలకు పైగా జైలులో ఉన్నారు. గతంలో ఢిల్లీ కోర్టును ఆశ్రయించినప్పటికీ.. ఆయన అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా సిసోడియా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. సిసోడియాకు సుదీర్ఘ జైలు శిక్ష కొనల్సిన అవసరం లేదని గతంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. అంతేకాదు..
ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి. కానీ, అలాంటిదేం జరగలేదని.. పైగా సరైన ఆధారాల్ని కూడా ఉంచలేదని సింఘ్వీ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు.. బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ, ఈడీ తరఫు లాయర్ వాదించారు. దీంతో.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది.
Also Read : Vinesh Phogat : ఒలింపిక్స్ లో యూవీ సుహాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరిన భారత రేజ్లర్